VM టుడే న్యూస్ - రాజకీయం / పల్నాడు జిల్లా : శ్రీనివాస్ రెడ్డికి నరసరావుపేట అసెంబ్లీ స్థానాన్ని కేటాయిస్తే ఓడించి తీరుతామని వైసీపీ రెడ్డి సామాజిక వర్గ నాయకులు అధిష్టానానికి లేఖలు ప్రస్తుత ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి నో చెప్పిన సజ్జల ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్ రోజు అలిగిన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రెండుసార్లు నరసరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా పని చేసిన చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి చేయలేదని విమర్శలున్నాయి పార్టీ అధికారంలోకి వచ్చాక అడ్డగోలుగా సంపాదించుకున్నారని నరసరావుపేటలో జి టాక్స్ వసూలు చేస్తూ పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారని నరసరావుపేట రెడ్డి సామాజిక వర్గ నేతలు సజ్జల దగ్గర వాపోయారు వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడానికి ఇతర పార్టీలోని ఓ సామాజికవర్గ నాయకులతో లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని మూడు రాజధానులకు వ్యతిరేకంగా ప్రకటనలు చేశారని ఇతరుల పార్టీలోకి వచ్చిన వారికి పెద్ద పీట వేస్తున్నారని అధిష్టానానికి నరసరావుపేట వైసీపీ ముఖ్య నాయకులు లేఖల ద్వారా వివరించారట గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అధికారంలోకి వచ్చాక బినామీ పేర్లతో కాంట్రాక్టులు అనుచరులతో సొంత పార్టీ నాయకుల దగ్గర సైతం వసూళ్లకు పాల్పడుతున్నారని అధిష్టానానికి ఆధారాలు సమర్పించారట
గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి విధానాలను మార్చుకోమని చెప్పిన సొంత పార్టీ కార్యకర్తలను పోలీస్ కేసులు పెట్టి వేధించారని నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్తలు గోపిరెడ్డి పై గురుగా ఉన్నారట.గోపిరెడ్డి ఎమ్మెల్యే అయిన మొదటి రోజు నుంచి మాజీ మంత్రి వర్గాన్ని పక్కనపెట్టి నియోజకవర్గంలో పార్టీని రెండు గ్రూపులుగా విడదీశారని వైసీపీ నాయకులు వాపోతున్నారు.వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట నుంచి పల్నాడు జిల్లాలోని ఓ ఎమ్మెల్యేకి టికెట్ కేటాయించాలని పట్టుబడుతున్నారట,గోపి రెడ్డికి టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని అధిష్టానానికి తెగేసి చెప్పారట? ప్రశాంత కిషోర్ సర్వేల్లోనూ ఇదే రిపోర్ట్ రావడంతో సజ్జల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి 2024 ఎన్నికల్లో నరసరావుపేట కేటాయించలేము అని తెగేసి చెప్పారట
*విలేకరులు కావలెను* *VM NEWS * VM న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో జిల్లాల వారిగా రిపోర్టర్లు మరియు స్టాఫ్ రిపోర్టర్ లు జోనల్ కోఅర్డినేటర్లు నియోజకవర్గం ఇన్ ఛార్జీలు అన్ని ప్రాంతాలలో పనిచేయుటకు కావలెను. సీనియర్ లకు ప్రాముఖ్యత మరియు రిపోర్టర్ గా చేయలనుకున్నవారికి మరియు అవకాశం కోసం ఎదురుచూస్తున్నా కొత్త వారికి కూడ మంచి అవకాశం అర్హత: 1.టెన్త్ 2. ఇంటర్ 3. డిగ్రి మరియు తెలుగు వ్రాయటం చదవటం ఉండాలి. సామాజిక స్పృహ,వార్తల సేకరణ పట్ల మక్కువ.. విలేకరులకు ఉండవలసిన ముఖ్య అర్హతలు..! మా ఛానల్ నుండి ప్రతి ఒక్కరికి ఐడికార్డు లోగో ఇవ్వబడును అసక్తికలవారు సంప్రదించండి Ph.no : 9959706801,8466005128
Admin
VM టుడే న్యూస్