VM టుడే న్యూస్ - ఆరోగ్యం / పల్నాడు జిల్లా : శారీరక మానసిక ఉల్లాసం కొరకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని యోగా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతుందని ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ యోగా సాధనం చేయడం ద్వారా ఆరోగ్యవంతులుగా ఉంటారని సి హెచ్ ఓ మంగళగిరి మణికుమారి ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ మిడ్డీ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ దుర్గం విజయశాంతి లు అన్నారు బుధవారం పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం మాచాయ పాలెం అప్పర్ ప్రైమరీ స్కూలులో మరియు సచివాలయం కార్యాలయం ఆవరణలో అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని యోగ పై అవగాహన మరియు యోగా యొక్క కొన్ని భంగిమలు ప్రదర్శించి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవనశైలి రోగాలైన మధుమేహం శ్వాస కోశ వ్యాధులు అధిక రక్తపోటు అల్ప రక్తపోటు ఇతర జీవనశైలి రోగాలను యోగా నియంత్రిస్తుందన్నారు యోగ అలసట, ఆందోళన ఒత్తిడిని యోగా బహిష్టు ల నెల క్రమమును క్రమపరుచుతుందన్నారు యోగాతో మానవత్వాన్ని జోడించి యోగ పరివ్యాప్త ప్రక్రియలో ప్రజా భాగస్వామ్యాన్ని పెంచాలన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ అభినందనీయులని వారి పేర్కొన్నారు వసుదైక కుటుంబం అనే ఇతివృత్తంలో ఈ సంవత్సరం జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆరోగ్య భారత్ అవతరణకు ఆలంబన కావాలి అని వారు అభిలాషించారు
ఈ సందర్భంగా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ విజయశాంతి వివిధ రకాలైన యోగా ఆసనాలను విద్యార్థులకు ప్రజలకు వివరించారు సూర్య నమస్కారం త్రాడు ఆసనం వృక్ష ఆసనం కటి చక్రాసనం గూర్చి వివరించారు ఈ సందర్భంగా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ దుర్గం విజయశాంతి మాట్లాడుతూ రండి లేవండి మేల్కోండి గమ్యం చేరేవరకు విశ్రమించకండి అని పేర్కొన్న స్వామి వివేకానందుని పిలుపు స్ఫూర్తిగా తీసుకొని భారతీయ ఆరోగ్య ఆనంద జీవ కళ యోగాను విశ్వవ్యాప్తం చేసేందుకు మనమందరం ఉద్యమించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ విజయశాంతి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయిని షేక్ రహి మున్నిసా ఆరోగ్య కార్యకర్త వాణి వీఆర్వో విజయ శాస్త్రి మరియు సచివాలయ సిబ్బంది గ్రామ పెద్దలు బద్దూరి పున్నారెడ్డి సింగంపల్లి వెంకట్ రెడ్డి కందుల సుబ్బారావు ఆశా కార్యకర్తలు కోటేశ్వరి కాంతమ్మ విద్యార్థినీ విద్యార్థులు గ్రామస్తులు పాల్గొన్నారు
Admin
VM టుడే న్యూస్