VM టుడే న్యూస్ - ఆరోగ్యం / పల్నాడు జిల్లా : కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమాన్ని సజావుగా చేపట్టాలని పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మంగళగిరి మణికుమారి ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ లు ఆరోగ్య, ఆశా కార్యకర్తలను ఆదేశించారు గురువారం జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఆశా కార్యకర్తలు చేపడుతున్న కుష్టు సర్వే కార్యక్రమాన్ని వారు చంద్రరాజుపాలెం, న్యూ చిట్యాల గ్రామాల్లో పరిశీలించారు కుష్టు వ్యాధి చిహ్నాలు, లక్షణాలు ను తెలియజేసే కరపత్రాలను వారు పంపిణీ చేశారు ఈ సందర్భంగా శిఖా శాంసన్ మాట్లాడుతూ జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈనెల 26వ తేదీ సోమవారం నుండి వచ్చే జులై నెల 16వ తేదీ వరకు కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమం వైద్య ఆరోగ్య శాఖ ద్వారా చేపట్టటం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి వద్దకు ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు సర్వే చేయడానికి వస్తారని ఎవరైనా అనుమానిత లక్షణాలు ఉంటే వైద్య సిబ్బందికి చూపించి తగిన చికిత్స పొందాలన్నారు అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య కార్యకర్తలు వద్ద ఎండిటి మందులు ఉచితంగా లభిస్తాయి అన్నారు ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని శాంసన్ కోరారు
Admin
VM టుడే న్యూస్