VM టుడే న్యూస్ - ఆరోగ్యం / పల్నాడు జిల్లా : పాము కాటుపట్ల అవగాహన కలిగి ఉండాలని బెల్లంకొండ మండలం ఆరోగ్య విస్తరణ అధికారి శిఖ శాంసన్ అన్నారు మంగళవారం ఆయన పాము కాటు పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు భారతదేశంలో 2900 రకాల జాతులు ఉన్న వాటిలో విషపూరితమైనవి కొన్ని మాత్రమే అని పేర్కొన్నారు నాగుపాము, రక్త పింజరి కట్లపాము రాచనాగులలో ఎక్కువగా ఉంటుంది అన్నారు ప్రతి సంవత్సరం రెండు లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారని 50,000 మంది పాము కాటు మూలంగా చనిపోతున్నారని అంచనా అని పేర్కొన్నారు పాముకాటు లక్షణాలు గూర్చి ఆయన వివరిస్తూ తీవ్రమైన నొప్పి ఉండటం నోటి నుండి నురుగు రావడం దేహము నీలిరంగులోకి మారడం గొంతు కండరాలు బిగుతుగా అవ్వటం స్పృహ కోల్పోవడం అని పేర్కొన్నారు పాము కాటుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆయన వివరించారు రాత్రి వేళ తప్పనిసరిగా వాడాలని పొలం గట్ల మీద కర్ర చప్పుడు చేస్తూ జాగ్రత్తగా నడవాలని కప్పలు ఉన్నచోట పాములు చేరుతాయి కాబట్టి పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు పాము కాటుకు ప్రధమ చికిత్స గూర్చి శాంసన్ వివరించారు పాము కాటుకు గురి అయిన ధైర్యంగా ఉండమని చెప్పాలని రోగికి విశ్రాంతి ఇవ్వాలి అని, గాయం పై ధారాళంగా నీళ్లు పోస్తూ కడగాలని శుభ్రమైన గుడ్డతో గాయాన్ని శుభ్రం చేయాలని తక్షణమే రోగిని సమీపంలోని తరలించాలని శాంసన్ తెలియజేశారు
Admin
VM టుడే న్యూస్