VM టుడే న్యూస్ - ఆరోగ్యం / పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా సత్తెనపల్లి అచ్చంపేట క్రోసూర్ చంద్రారాజు పాలెం ఫణిదం 75 తాళ్లూరు ముప్పాళ్ళ ప్రాథమిక కేంద్రాల పరిధిలోని ఆరోగ్య కార్యకర్తలకు హెల్త్ సూపర్వైజర్లకు హెల్త్ మేనేజ్మెంట్ సిస్టం ఆన్లైన్లో అప్లోడ్ చేసే విధానం గూర్చి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సత్తనపల్లిలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం నందు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ శిక్షణ కార్యక్రమం జిల్లా వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం అధికారిని జి గీతాంజలి మరియు జిల్లా స్టాటికల్ ఆఫీసర్ నీలకంఠేశ్వరరావు జిల్లా ఆరోగ్య విస్తరణ అధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు నూతనంగా భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన హెచ్ ఎం ఐ ఎస్ ఫార్మేట్లను ఏ విధంగా పూర్తి చేయాలో వివరించారు ఆన్లైన్లో ఫార్మేట్స్ డేటా కేంద్ర ప్రభుత్వానికి అందుతాయి కాబట్టి ప్రతి ఆరోగ్య అంశాలను జాగ్రత్తగా పొందుపరిచి ఆన్లైన్లో నమోదు చేయాలని వారు తెలియజేశారు
ఆరోగ్య విస్తరణ అధికారి ఫార్మేట్స్ విధానంను గూర్చి ఆరోగ్య కార్యకర్తలకు వివరించారు ఆరోగ్య కార్యకర్తలకు వివిధ యాప్ లు వినియోగించే విధానం డేటా సేకరించే విధానంల ఫై జిల్లా గణాంక అధికారి నీలకంటేశ్వర రావు నిరుత్తి చేశారు ఈ సందర్బంగా డాక్టర్ గీతాంజలి మాట్లాడుతూ మరియు ఇంటెన్స్ ఫైడ్ మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమంఆగస్టు,సెప్టెంబర్ జరుపుటకు నిర్ణయించినందున ఆరోగ్య, ఆశా కార్యకర్తలు అందరూ వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోకుండా గర్భిణీ స్త్రీలను ఐదు సంవత్సరముల లోపు పిల్లలను గుర్తించే సర్వే రెండు మూడు రోజుల్లో పూర్తి చేసి జిల్లా కార్యాలయానికి పంపాలని ఈ కార్యక్రమంలో ముప్పాళ్ళ వైద్యాధికారి రమాదేవి డాక్టర్ కవిత డాక్టర్ ధర్మశాస్త్రి సిహెచ్ వెంకటేశ్వరరావు శ్రీధర్ రెడ్డి ఆరోగ్య విస్తరణ అధికారులు శిఖ శాంసన్ పోసి పోగు వెంకట్రావు వివిధ పిహెచ్సి ల ఆడ, హెల్త్ సూపర్వైజర్లు సి హెచ్ ఓ లు ఎం పి హెచ్ ఈ ఓ లు మహిళా ఆరోగ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Admin
VM టుడే న్యూస్