VM టుడే న్యూస్ - ఆరోగ్యం / పల్నాడు జిల్లా : వానాకాలం సీజన్లో ప్రబలే కండ్లకలక వ్యాధి లక్షణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గూర్చి ఆరోగ్య విస్తరణ అధికారి శిఖ శాంసన్ గురువారం పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం కందిపాడు వైయస్సార్ హెల్త్ క్లినిక్ కార్యాలయం నందు జరిగిన అవగాహన సదస్సులో వివరించారు ఈ సందర్భంగా శాంసన్ మాట్లాడుతూ కండ్ల కలక వ్యాధి లక్షణాలు తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు కండ్ల కలక వ్యాధిగ్రస్తుల కళ్ళు నీరు కారుతూ ఉంటాయని కంటి రెప్పలు ఉబ్బి ఉండవచ్చు అని కళ్ళల్లో మంట, నొప్పి, కొద్దిపాటి దురద కూడా ఉంటాయి అన్నారు కళ్ళల్లో పుస్సులు పడతాయని కష్టంగా ఉంటుందని పేర్కొన్నారు నిద్ర తర్వాత కండ్ల రెప్పలు తెరవటం కష్టమవుతుందన్నారు పొంగు వ్యాధి లోను సుఖ వ్యాధులతోనూ బాధపడే గర్భవతులకు బిడ్డలకు కూడా కండ్ల కలక సోకే అవకాశం ఉందన్నారు కండ్లకలక వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన వివరిస్తూ కండ్ల నుండి కారే నీటిని శ్రావన్నీ శుభ్రమైన శుభ్రపరచాలన్నారు రోగి బట్టలను ప్రతిరోజు నీటితో ఉడికించి క్రిమి రహితం చేయాలన్నారు చేతి రుమాలు, తువాలు ఒకరు వాడినవి వాడటం వలన వ్యాధి సోకిన వారు ఇతరులతో చాలా దగ్గరగా ఉండటం వలన కండ్ల కలక వ్యాధి తొందరగా వ్యాపిస్తుందన్నారు ఇది ఒక అంటువ్యాధి అని వ్యాధి సోకిన వాళ్ళు గోరువెచ్చని నీళ్లతో తరచూ కడుక్కోవాలన్నారు డాక్టర్ సలహా పై ఐ డ్రాప్స్ వాడాలని పేర్కొన్నారు కండ్ల కలక సాధారణంగారెండు,మూడు రోజుల్లో తగ్గిపోతుంది కాబట్టి అవసరం లేదన్నారు వైద్యుని సూచనలు మాత్రం కచ్చితంగా పాటించాలని సూచించారు ఈ కార్యక్రమంలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పార్వతి ఆరోగ్య కార్యకర్త అరుణ తదితరులు పాల్గొన్నారు
Admin
VM టుడే న్యూస్