VM టుడే న్యూస్ - వార్తలు / పల్నాడు జిల్లా : 77వ స్వాతంత్ర దినోత్సవ ము సందర్భంగా పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం చండ్రాజు పాలెం పిహెచ్సిలో వైద్యాధికారి కెవి కోటేశ్వరావు జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు పోరాటాలతో త్యాగాలతో వారి వారి జీవితాలను తృణ ప్రాయంగా అర్పించి పోరాడి తెచ్చుకున్న ఈ స్వాతంత్ర దినం భావితరాలకు ప్రేరణ కావాలి అన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా బ్రిటిష్ తొత్తుల కబంధహస్తాల్లో చిక్కుకొని నలిగిపోయిన భరతమాతకు స్వేచ్ఛ వాయువులు వచ్చిన రోజు ఈ స్వాతంత్ర దినోత్సవం అన్నారు దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలను భారతీయులందరూ స్మరణకు తెచ్చుకోవాలన్నారు దేశ సరిహద్దు వద్ద దేశం కోసం పోరాడుతున్న వీర జవానులకు పోలీసులకు దేశాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్న కార్మిక కర్షక నేత అన్నలకు. భారతీయులందరికీ శాంసన్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మంగళగిరి మణికుమారి మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో అమరవీరుల త్యాగాలను నేటి తరానికి తెలియజేద్దామని సౌబ్రాతృత్వ స్ఫూర్తితో దేశి ఖ్యాతిని ఇనుముడింప చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు . ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ నర్స్ రాణి ఆరోగ్య అధికారి శ్రీనివాస రావు హెల్త్ సూపర్వైజర్లు భాషా సయ్యద్ కె. బేగం మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ లు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Admin
VM టుడే న్యూస్