VM టుడే న్యూస్ - ఆరోగ్యం / పల్నాడు జిల్లా : ఒక ఆల్బెండజోల్ మాత్ర కడుపులోని నులిపురుగులను నాశనం చేస్తుందని నులిపురుగుల మాత్రలతో పోషకాలను కాపాడుకొని ఆరోగ్యవంతులుగా ఎదగాలని ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ విద్యార్థులకు సూచించారు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకొని గురువారం మాప్ అప్ కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం బెల్లంకొండ లోని జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఈనెల పదవ తేదీన డి వార్మింగ్ డే సందర్భంగా ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోకుండా గైరాజరైన విద్యార్థిని విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా శాంసన్ మాట్లాడుతూ నులిపురుగుల కారణంగా కిషోర్ బాలికలలో పోషకాహారం లోపించి రక్తహీనత, ఆకలి మందగించటం, నీరసం, ఆందోళన, కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు, బరువు తగ్గటం వంటి రుగ్మతలకు గురికావాల్సి వస్తుందన్నారు
నులిపురుగులను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం ద్వారా పిల్లలకు నులిపురుగుల నివారణ మందులను పంపిణీ చేసి ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తుందన్నారు బెల్లంకొండ మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో, జూనియర్ కళాశాలలో, అంగన్వాడీ కేంద్రాల్లో, కస్తూరిబా బాలికల విద్యాలయంలో, ఏపీ ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఒకటి నుండి 19 ఏళ్ల మధ్య వయసున్న వారికి ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు నులిపురుగుల వ్యాప్తి ప్రాణాంతకమైన భారంగా మారిన దేశాల్లో మన దేశం కూడా ఉందన్న విషయాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పటికే ప్రకటించింది అన్నారు ఈ సందర్భంగా ప్రతి విద్యార్థికి చేతుల పరిశుభ్రత పట్ల సిబ్బంది అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య అధికారి చట్టు శ్రీనివాస రావు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ సునీత సచివాలయం ఆరోగ్య కార్యకర్త మధులత ఆశా కార్యకర్తలు ఫాతిమా కామేశ్వరి మేరీ తదితరులు పాల్గొన్నారు
Admin
VM టుడే న్యూస్