VM టుడే న్యూస్ - ఆరోగ్యం / పల్నాడు జిల్లా : ప్రస్తుత వాతావరణ మార్పుల వల్ల కాలానుగుణంగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ ఆరోగ్యపరంగా అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ అన్నారు శుక్రవారం ఆయన పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం చిట్యాల గ్రామంలో జరుగుతున్న డ్రై డే_ _ఫ్రైడే కార్యక్రమాల అమలు క్షేత్రస్థాయిలో పరిశీలన, సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ప్రజలకు పలు విషయాలను వివరించారు సాధారణంగా వర్షాకాలంలో నీటి నిల్వలు ఉండటం దోమలు నిల్వ ఉన్న నీటిలోనే గుడ్లు పెట్టి పది రోజుల్లోనే పెద్ద దోమలుగా పెరుగుతాయన్నారు ఈ దోమల వ్యాప్తి ద్వారానే మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా, ఫైలేరియా లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు దోమలు పుట్టకుండా అదుపు చేయడం, దోమలు కుట్టకుండా చూసుకోవటం
దోమ కాటుకు గురి అయితే వైద్యుల సూచనల మేరకు సరైన మందులు తీసుకోవటం చేయాల్సి ఉంటుందన్నారు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో భాగంగా నీటి నిల్వలు లేకుండా లోతట్టు ప్రాంతాలను పూడికతీత సరి చేసుకోవాలన్నారు దోమ కాటుకు గురికాకుండా దోమతెరలు, మస్కిటో రెప్ల్లెంట్స్ వాడాలన్నారు తొట్టు ల లో నీరు నిల్వ ఉంచుకొని వాటిని ఖాళీ చేసి ఆరబెట్టి మరల నీరు పట్టుకొనవలెనని, ఈ విధముగా చేయుట వలన లార్వా అభివృద్ధిని నిరోధించవచ్చునని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మంగళగిరి మణికుమారి, ఆరోగ్యాధికారి చట్టూ శ్రీనివాస రావు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ సాంబశివరావు, సచివాలయం ఆరోగ్య కార్యకర్త వడితే సోమిలి భాయ్ ఆశా కార్యకర్తలు విజయలక్ష్మి భాయ్ రమాదేవి భాయ్ తదితరులు పాల్గొన్నారు
Admin
VM టుడే న్యూస్