VM టుడే న్యూస్ - ఆరోగ్యం / పల్నాడు జిల్లా : దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ ఆదివారం పేర్కొన్నారు ఆదివారం ప్రపంచ దోమల దినోత్సవం పురస్కరించుకొని ఆయన చంద్రారాజుపాలెం పీహెచ్సీలో దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గూర్చి వివరించారు మలేరియా వ్యాధి దోమ కాటు ద్వారా సోకుతుంది అని ప్రధాన ఆవిష్కరణను వివరించిన బ్రిటిష్ శాస్త్రవేత్త వైద్యులు కీర్తిశేషులు నోబెల్ బహుమతి గ్రహీత సర్ రోనాల్డ్ రాస్ ప్రకటన చేసిన రోజుకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఆగస్టు నెల 20వ తేదీలో ప్రపంచ దోమల దినోత్సవం వైద్య ఆరోగ్యశాఖ ద్వారా పాటించటం ఆనవాయితీ అని అన్నారు రెండు మూడు రోజులకు మించి జ్వరంతో బాధపడే వ్యక్తులు సమీపంలోని ఆరోగ్య కార్యకర్తలను గాని మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ లు ను గానీ సంప్రదించాలన్నారు ప్రతి వైయస్సార్ హెల్త్ క్లినిక్ నుండి మలేరియా వ్యాధి నిర్ధారణకు మలేరియా రాపిడ్ డయాగ్నస్టిక్ టెస్ట్ ఆర్డిటి కిట్టు ద్వారా 15 నిమిషాల్లో మలేరియా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు
అన్నారు మలేరియా కారణ దోమల నివారణకు పరిసరాల పరిశుభ్రత, మురుగునీరు నిలవ లేకుండా చూడటం, శరీర అవయవాలను పూర్తిగా కప్పుకునేలా దుస్తులు ధరించడం, దోమతెరలు వాడటం, దోమలను తరిమి వేయడానికి ఆధునిక, సహజ మస్కిటో రిపెల్లెంట్స్ వాడటం, ప్రతి ఒక్కరు విధిగా వారంలో ఒక్కరోజు డ్రై డే పాటించటం వంటి పద్ధతులు ఆచరించాలన్నారు. జీరో మలేరియా ప్రపంచాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ తమ పాత్ర పోషించాలని ఆయన కోరారు
Admin
VM టుడే న్యూస్