VM టుడే న్యూస్ - వార్తలు / పల్నాడు జిల్లా : మదర్ తెరిసా గొప్ప మానవతా మూర్తి అని ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపి అసంఖ్యాక ప్రజలకు స్ఫూర్తిగా నిలిచిన మహనీయురాలని ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ అన్నారు. శనివారం మదర్ థెరిస్సా జయంతి పురస్కరించుకొని పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెం బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావ్ యూత్ ఆధ్వర్యంలో జరిగిన మదర్ థెరీసా జయంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా శాంసన్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా నిరుపేదలకు నిసహాయులకు అత్యంత బలహీనులకు సేవ చేయడానికి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయురాలు అని పేర్కొన్నారు మదర్ స్వచ్ఛంద సేవతో స్పర్శించిన జీవితాలు కారణంగా లక్షలాది మందికి ఆరాధ్య దేవత అయ్యారన్నారు . మానవత్వానికి మించిన సంపద లేదు మనిషి ఔన్నత్యానికి కొలబద్ద మేధస్సు కాదు _హృదయం అని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయురా లు మదర్ తెరిసా అని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
Admin
VM టుడే న్యూస్