VM టుడే న్యూస్ - ఆరోగ్యం / పల్నాడు జిల్లా : నేత్రదానం మహోన్నతమైనది అమూల్యమైన నేత్రాలను మట్టి పాలు , బుగ్గిపాలు చేయవద్దు నేత్రదానం మనిషిలోని మానవత్వాన్ని తెలియజేస్తుంది నేత్రదానం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం అని పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు పిహెచ్సి ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ అన్నారు ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ వరకు 38వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకొని బుధవారం సచివాలయంలో జరిగిన ఆరోగ్య సదస్సులో ఆయన నేత్రదానం అనే అంశంపై మాట్లాడారు ఆయన మాట్లాడుతూ బ్రతికుండగా ఎన్నో రకాల దానాలు చేస్తాం కానీ చనిపోయిన తర్వాత కూడా చేయగల దానం నేత్రదానం మాత్రమే అని పేర్కొన్నారు నేత్రదానం అనేది మరణించిన వ్యక్తి కళ్ళని దానం చేయటమే తప్ప బ్రతికి ఉన్న వారి కళ్ళని కాదని ఆయన అన్నారు ప్రజలలోని రకరకాల మూఢనమ్మకాలు, మత నమ్మకాలు, భయాలు, అపోహాలు, నేత్రదానానికి అవరోధంగా ఉన్నాయన్నారు హెచ్ఐవి, మెదడు వాపు జబ్బు, బ్లడ్ క్యాన్సర్, పచ్చకామెర్లు, కంటి వ్యాధులు ఉన్నవారు నేత్రదానానికి అర్హులు కాదని పేర్కొన్నారు
నేత్రదానమును సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు తీసుకోవాలని, నేత్రాలు దానం చేయాలి అనుకునే వ్యక్తులు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల గుంటూరు నందు నేత్ర వైద్య విభాగంలో సంప్రదించాలని శాంసన్ కోరారు అనంతరం ఆయన వ్యాధి నిరోధక టీకా కార్యక్రమం ను పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో సచివాలయం ఆరోగ్య కార్యకర్త బి కోటేశ్వరి , కాటం వెంకటరెడ్డి, పానెము అప్పిరెడ్డి శ్రీనివాసరెడ్డి , ఓర్సు కృష్ణయ్య, షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు
Admin
VM టుడే న్యూస్