VM టుడే న్యూస్ - వార్తలు / పల్నాడు జిల్లా : పిడుగురాళ్ల పిల్లుట్లరోడ్డు జండా చెట్టు సెంటర్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కరపత్రావిష్కరణ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పిడిఎం రాష్ట్ర అధ్యక్షులు కే శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో జీడీపిక్కల రైతులు పడే కష్టాన్ని పిడిఎం తదితర సంఘాల ఆధ్వర్యంలో ఫ్యాక్ట్ పెండింగ్ట్ చేయడం జరిగింది అక్కడున్న రైతులు ఇబ్బందులను విన్న తర్వాత జీడిపిక్కల పొలాలు ఎకరానికి నాలుగైదు క్వింటాలకు పెచ్చు కావు అక్కడ ఉన్న దళారీలు చాలా దుర్మార్గంగా 6000, 5000 అని చెప్పేసి చాలా తక్కువ రేట్ కి తీసుకోవాలనే ప్రయత్నం జరుగుతున్నది దాదాపు వాళ్ల పెట్టుబడులకి కనీసం పావు వంతు కూడా రాని పరిస్థితి పంట చేతికి వచ్చే సమయానికి తుఫాన్లు రకరకాల తెగుళ్ళతో దిగుబడి కూడా ఆగిపోవడం జరుగుతుంది వీళ్ళని తక్షణమే ప్రభుత్వం ఆదుకొని 80 కేజీల బస్తా కి 16 వేల రూపాయలు చొప్పున ప్రభుత్వమే ఖరీదు చేయాలని డిమాండ్ చేశారు
అనంతరం ఎం సి పి ఐ జిల్లా అధ్యక్షులు కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో జీడి పంటకు ప్రసిద్ధ గాంచిన శ్రీకాకుళం జిల్లా ఉద్దానం జీడి పంట రైతులు నేడు నిత్యం తుఫానుల వలన తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు ఒక ఎకరానికి ప్రతి సంవత్సరం 20 వేల వరకు పెట్టుబడి పెడితే తుఫాను వలన పెట్టుబడి కూడా రాని పరిస్థితులను రైతులు ఎదుర్కొంటున్నారు కనుక ఇటువంటి రైతులను ప్రభుత్వం వెంటనే గుర్తించి వారి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని నాణ్యమైన పురుగుమందులు ఎరువుల సబ్సిడీ రైతులకు ఇవ్వాలని, జీడి పంట బస్తాకు 16,000 వేలు మద్దతు ధర ప్రకటించాలని కోరుతూ పిడిఎం ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఈనెల 09న ఉదయం 11 గంటల నుండి జరుగు ఈ సమావేశానికి మేధావులు బుద్ధి జీవులు కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని సి.టి.యు నాయకులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Admin
VM టుడే న్యూస్