VM టుడే న్యూస్ - వార్తలు / పల్నాడు జిల్లా : చిలకలూరిపేటలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. నంద్యాలలో టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబును సిఐడి పోలీసులు అరెస్టు చేసి కాన్వాయ్ లో విజయవాడ తీసుకు వెళుతున్న దృశ్యాలను కవర్ చేసేందుకు చిలకలూరిపేట NRT సెంటర్లో విధినిర్వహణలో ఉన్న ఈనాడు విలేఖరి చండ్ర మల్లికార్జునరావు, ఐ న్యూస్ విలేకరి ఆలపాటి ఆంజనేయులుపై దాడి చేశారు. జిల్లా ఎస్పీ రవి శంకర్ రెడ్డి విలేకరులపై దాడి చేశారు. ఇద్దరు విలేకరులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటన నిరసిస్తూ APUWJ చిలకలూరిపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై NRT సెంటర్లో విలేకరులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎస్పీ రవిశంకర్ రెడ్డి క్షమాపణ చెప్పాలని విలేకరులు డిమాండ్ చేశారు
పోలీసులకు వ్యతిరేక నినాదాలు చేశారు. చిలకలూరిపేట అర్బన్ సిఐ రాజేశ్వర రావు, రూరల్ సీఐ అచ్చయ్య , అర్బన్, రూరల్ ఎస్సైలు ఎన్నార్టీ సెంటర్ కు చేరుకొని విలేకరులకు సర్ది చెప్పారు. ఎస్పీ తరఫున సిఐ క్షమాపణ చెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు పుల్లగూర భక్తవత్సలరావుతో పాటు పలువురు ప్రెస్ క్లబ్ సభ్యులు, విలేకరులు పాల్గొన్నారు.
Admin
VM టుడే న్యూస్