VM టుడే న్యూస్ - వార్తలు / N T R జిల్లా : స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అవినీతి కేసులో జైలు పాలైన చంద్రబాబుకి మందకృష్ణ ఎమ్మార్పీఎస్ పేరుతో మద్దతు ఇవ్వడం చాలా విచారకరం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ వారు చేపట్టిన బంద్ కు ఎమ్మార్పీఎస్ మందకృష్ణ మద్దతు ఇవ్వడం చాలా సిగ్గుచేటు 2014లో మాదిగల మద్దతు మాదిగల ఓట్లు పొంది అధికారంలో కూర్చున్న చంద్రబాబు మాదిగలను 2014 నుండి 2019 వరకు అణిచివేసినందుకా మద్దతు 2017లో కురుక్షేత్రం పేరుతో మందకృష్ణ పెట్టిన సభను జరగనీయకుండా పోలీసు బలగాలతో అడ్డుకొని మాదిగ ఉద్యమకారులపై అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేసినందుకు మద్దతు చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరములు మాదిగలను ఆంధ్ర రాష్ట్రంలో సభలు సమావేశాలు జరగ కుండా మాదిగ ఉద్యమకారులపై ఉక్కుపాదం వేసినందుకు మద్దతు
ఆంధ్రప్రదేశ్లో మంద కృష్ణ ఉద్యమం పేరుతో తిరుగుతున్నప్పుడు నువ్వు తెలంగాణ వాడివి నీకు ఇక్కడేం పని అని పోలీస్ బలగాలతో పోలీస్ వాన్ లో నిన్ను ఎక్కించి ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో గెంటివేసినందుకా మద్దతు గడచిన 30 సంవత్సరాలుగా చంద్రబాబు కనుసన్నలలో నడుస్తున్న నీవు ఇప్పటికైనా ఎమ్మార్పీఎస్ మహాజన సోషలిస్ట్ పార్టీ ముసుగులు తీసి తెలుగుదేశం పార్టీ పచ్చ కండువా కప్పుకుంటే బాగుంటుందని సీమాంధ్ర మాదిగలరా మరొకసారి మందకృష్ణ మాయలో పడకండి. ఇప్పటికైనా బయటపడండి మందా నాగమల్లేశ్వరరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. జగనన్న రాష్ట్ర అభిమాన సంఘం. ఆంధ్ర ప్రదేశ్
Admin
VM టుడే న్యూస్