Friday, 08 December 2023 10:07:06 PM
# పల్నాడు జిల్లా ఓ బి సి మహిళ మండలి అధ్యక్షురాలు గంజర్ల ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో బీసీ ల కమిటీలు ఏర్పాటు # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన # ఐదు సంవత్సరాల లోపు చిన్నారులలో నిమోనియా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి # మద్యం కంపెనీల యజమానుల పేర్లు ప్రజాక్షేత్రంలో పెట్టగలరా?: పురందేశ్వరి # ఆరోగ్య సురక్ష క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: క్రోసూరు మండల స్పెషల్ ఆఫీసర్ # పాస్‌పోర్ట్‌ ప్రత్యేక డ్రైవ్‌ # వైయస్ఆర్సీపీ నాయకుడు చింతపల్లి రవి భార్య అకాల మరణం: పరామర్శించిన జల వనరుల శాఖ మంత్రి # చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చంద్రబాబు # వైసీపీని తరిమికొడతారు:నేను సైతం నిరాహారదీక్షలో ఐటీడీపీ నాయకులు 27వ రోజు కొనసాగిన దీక్ష # మాచర్ల నియోజకవర్గం మాలల ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథిగా మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు డా గోదా జాన్ పాల్ # వైసీపీకి పుట్టగతులుండవ్‌:సైకో పోవాలి - సైకిల్ రావాలి:నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు # శ్యామ్ మిత్రమండలి ఆధ్వర్యంలో శిఖ శాంసన్ కు ఘన సత్కారం # విద్యుత్ సమస్య కు శాస్వత పరిస్కారం: బొల్లా బ్రహ్మనాయుడు # ఏలూరు కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుల అరెస్ట్:క్రైమ్ సినిమాను తలపించిన ఏలూరులో కిడ్నాప్ ఘటన # ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు నల్లారి కిరణ్ మరియు బిజెపి అధ్యక్షులు దగ్గుబాటి పురందరేశ్వరిని కలిసిన.. అట్లూరి # గుడిపాడు లో జగనన్న ఆరోగ్య సురక్ష # చిలకలూరిపేట మండలం లింగుంట్ల వద్ద పిడుగుపాటు... # మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి కి చిత్రపటానికి నివాళులు అర్పించిన బొర్రా # రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి # కారంపూడిలో ఘనంగా గాంధీజయంతి వేడుకలు

కోసూరు మండలంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : పల్నాడు జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ గుడిసె చంద్రశేఖర్

కోసూరు

Date : 21 September 2023 08:07 PM Views : 67

VM టుడే న్యూస్ - వార్తలు / పల్నాడు జిల్లా : క్రోసూరు మండలంలో జరిగే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులందరూ విజయవంతం చేయాలని పల్నాడు జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ గుడిసె చంద్రశేఖర్ అన్నారు గురువారం ఆయన క్రోసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్యాధికారులతో సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు అమలు తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం క్రోసూరు లో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం సర్వేను ఆయన పరిశీలించి ఆరోగ్య కార్యకర్తలకు ఆశా కార్యకర్తలకు అనేక సూచనలు సలహాలు అందజేశారు యాప్ లో అప్లోడ్ తీరును పరిశీలించారు అనంతరం గరికపాడు సచివాలయంలో జరుగుతున్న ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ను ఆయన పరిశీలించారు గరికపాడు లో అంగన్వాడీ కేంద్రం ను పరిశీలించి యాప్లను తనకి చేశారు ఈ సందర్భంగా డిప్యూటీ డి ఎం హెచ్ ఓ చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఇందులో భాగంగా ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం నిర్వహిస్తుంది అని అన్నారు ఆరోగ్య సమస్యలకు సంబంధించి ప్రతి ఇంటిని ప్రతి వ్యక్తిని కవర్ చేయాలని ప్రతి పౌరుడు తో ఇంటరాక్ట్ అయ్యి ఆరోగ్య వివరాలను గుర్తించాలన్నారు సెప్టెంబర్ 30వ తేదీ నుండి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో నలుగురు డాక్టర్లు పాల్గొనడం జరుగుతుందన్నారు ఇందులో ఇద్దరు స్పెషలిస్ట్ వైద్యులు ఉంటారన్నారు ఇందులో భాగంగా వాలంటీర్లు రెండుసార్లు ఇంటింటి క్యాంపైన్ చేయాలి అని అన్నారు ఆరోగ్య కార్యకర్తలు సిహెచ్ఓలు ఇంటింటికి వెళ్లి క్యాంపన్లో భాగంగా ఆరోగ్యశ్రీ యాప్ ను ఫోన్లో డౌన్లోడ్ చేయించాలన్నారు ఫ్యామిలీ డాక్టర్ విధానం, 104,108, ఆరోగ్యశ్రీ సేవలు తదితర అన్ని రకాల అంశాలపై ఇంటింటి క్యాంపెయిన్ చేపట్టాలి అన్నారు అండర్ వెయిట్ అనీమియా గర్భవతులను గుర్తించాలన్నారు

క్రోసూరు మండలంలో షెడ్యూల్ డాక్టర్ రమాదేవి అక్టోబర్ నెల మూడో తేదీన అనంతవరం, నాలుగవ తేదీన గుడిపాడు, ఐదో తేదీన క్రోసూరు 2, ఆరో తేదీన పీస పాడు, ఏడవ తేదీన క్రోసూరు 3, 9వ తేదీన 88 తాళ్లూరు, పదవ తేదీన బయ్యవరం, 11 వా తేదీన ఊటుకూరు, 12 వా తేదీన అందుకూరు, 13 వ తేదీన ఆవుల వారి పాలెం, 16 వ తేదీన హసనాబాద్, 17వ తేదీన నాగవరం 18 వ తేదీన దొడ్లేరు 2, 27 వా తేదీన దొడ్లేరు 1 సచివాలయాల పరిధిలో క్రోసూరు మండలంలో జగనన్న ఆరోగ్య సురక్ష హెల్త్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని ప్రజలందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని డాక్టర్ రమాదేవి కోరారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ బాల అంకమ్మ భాయ్ డాక్టర్ సిరి చందన డాక్టర్ మహమ్మద్ సాధ్ సిహెచ్ఓ సాంబశివరావు ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ సీనియర్ అసిస్టెంట్ జానీ భాష హెల్త్ సూపర్వైజర్లు శివుడు అమర జ్యోతి ఆరోగ్య కార్యకర్తలు సిహెచ్ వోలు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Madhu

Admin

VM టుడే న్యూస్

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2023. All right Reserved.

Developed By :