VM టుడే న్యూస్ - వార్తలు / పల్నాడు జిల్లా : మండల కేంద్రమైన రాజుపాలెం పెట్రోల్ బంకు ఎదురు కూల్ డ్రింక్ షాప్ దుకాణం ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్న నంబూరి. నాగమల్లేశ్వరరావు, శిరీష దంపతులపై రాజుపాలెం ఎస్సై వెంకటనారాయణ దురుసుగా వ్యవహరిచారు. దంపతుల వివరాల ప్రకారం పెట్రోల్ బంకు సమీపంలో తమ సొంత స్థలంలో దుకాణాన్ని ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నామని అయితే తమ దుకాణం దగ్గరలో ప్రభుత్వ వైన్ షాపు ఉందని దానికి కొంత దూరంలో అధికార పార్టీకి చెందిన ఒక వ్యక్తి దుకాణాన్ని ఏర్పాటు చేసి అక్కడ మందుబాబులు మందు తాగేందుకు షెల్టర్ కల్పిస్తూ ఉన్నారని అయితే వారి వ్యాపారానికి తమ వ్యాపారం అడ్డుగా ఉందని భావించి పోలీసులు సహాయంతోదౌర్జన్యానికి దిగుతున్నారని ఆరోపిస్తునారు .బుధవారం సాయంత్రం నంబూరు శిరీష దుకాణంలో ఉండగా ఎస్సై వెంకట నారాయణ వచ్చి లాటి తో తన భర్త ను కొట్టడంతో తన భర్త పడిపోవడం జరిగిందని ఇక్కడ దుకాణం తీయకపోతే మీ పే గంజాయి, మద్యం కేసులు బనాయించి మిమల్ను జైలే కు పంపిస్తాను అని ఎస్సై బెదిరించి ఒక మహిళ అని కూడా చూడకుండానే తీవ్ర పదజాలంతో దుర్భసలాడి తీవ్ర మానసిక వేదనకు గురి చేశారని శిరీషఆవేదన వ్యక్తచేశారు.
రాజకీయ కక్షతో దుకాణాన్ని తోలగించాలని ఒత్తిడి .. తోలగించాలేదని అక్కసుతో లాఠీ తో చితకబాదిన ఎస్సై నారాయణ .. సొంత స్థలంలో కూల్ డ్రింక్ షాప్ నడుపుకుంటున్న నాగమల్లేశ్వరావు.. కూల్ డ్రింక్ షాప్ ను తోలగించాలని ఎస్సై పై రాజకీయ ఒతిళ్లు .. ప్రభుత్వ వైన్ దగ్గర లో కూల్ డ్రింక్ షాప్ ఉండకూడదు అంటూ పోలీసుల హుకుం.. ఒంటిపై వాతలు, గాయాలతో ఆసుపత్రిలో చేరిన మల్లేశ్వరరావు..
Admin
VM టుడే న్యూస్