VM టుడే న్యూస్ - వార్తలు / పల్నాడు జిల్లా : పుణ్యమూర్తి వెంకటేశ్వర్లు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ పల్నాడు జిల్లా అధ్యక్షుడు గా నియామకవటం అభినందనీయమని మాచర్ల మండలం భైరవుని పాడు మాజీ సర్పంచ్ పందరబోయన కొండయాదవ్ అన్నారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రతి సమస్యను అధికారులు దృష్టికి తీసుకెళ్తూ వాటిని పరిష్కరించేలా నాయకులను చైతన్య పరుస్తూ ముందుకు వెళుతున్న పివిఆర్ యాదవ్ ను అభినందిస్తూ మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో బైరంపాడు యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు. అలాగనే పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా అధ్యక్షుడు అమ్మ జిలాని మరియు మాచర్ల పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఓర్చు కాంతి కుమార్ తదితరులు పివిఆర్ JAAP జర్నలిస్ట్ యూనియన్ కి పల్నాడు జిల్లా మొట్టమొదటి అధ్యక్షుడిగా నియామకం పట్ల హర్షం వ్యక్తం చేసి పివిఆర్ యాదవ్ కి దృశ్యాలవతో సన్మానించడం జరిగింది
Admin
VM టుడే న్యూస్