VM టుడే న్యూస్ - వార్తలు / పల్నాడు జిల్లా : ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తున్న పాత్రికేయులు అందరికీ ఇళ్ల స్థలాలు వచ్చేలా తన వంతు కృషి చేస్తానని పల్నాడు జిల్లా పాత్రికేయుల సంఘం (జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్) అధ్యక్షుడు పివిఆర్ యాదవ్ అన్నారు. జాప్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన పివిఆర్ యాదవ్ ను నందిదాత్రిక దినపత్రిక పల్నాడు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ సైదారావు సోమవారం సత్కరించారు. ఈ సందర్భంగా పివిఆర్ యాదవ్ మాట్లాడుతూ పల్నాడు ప్రాంతంలో ఎంతో మంది పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు మంజూరు కాలేదని ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తానన్నారు. అలాగే ప్రభుత్వ విప్పు, మాచర్ల శాసనసభ్యులు ,పల్నాడు జిల్లా అభివృద్ధి కమిటీ అధ్యక్షులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్లనట్లు ఆయన పేర్కొన్నారు
Admin
VM టుడే న్యూస్