VM టుడే న్యూస్ - వార్తలు / పల్నాడు జిల్లా : పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం గుడిపాడు గ్రామంలో బుధవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా ఎంపీపీ పెరుమాళ్ళపల్లి కోటయ్య జడ్పిటిసి షేక్ జమీల గఫూర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీపీ కోటయ్య మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టని అనేక సంక్షేమ కార్యక్రమాలు మన రాష్ట్రంలో అమలవుతున్నాయని ఆయన అన్నారు ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య సమస్యలపై ఆరా తీసి ఉచితంగా మందులు అందించే విధంగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని ఆయన కొనియాడారు ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ మహిళా శిశు సంక్షేమ శాఖ ఏర్పాటుచేసిన వివిధ స్టాల్స్ ను ఆయన జడ్పిటిసి తో సందర్శించారు
వైద్య శిబిరాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి డిప్యూటీ డిఎంహెచ్ఓ చంద్రశేఖర్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సమస్యలను తీర్చేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు బుధవారం ఆయన గుడిపాడు లో జరుగుతున్న జగనన్న ఆరోగ్య శిబిరాన్ని సందర్శించారు ఈ కార్యక్రమంలో ఇఎన్టి స్పెషలిస్ట్ డాక్టర్ నవోమి సురేఖ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ విశ్వనాథ్ డాక్టర్ బి ఎస్ రమాదేవి డాక్టర్ ఎన్ బాల అంకమ్మ బాయ్ డాక్టర్ సిరి చందన సి హెచ్ ఓ సాంబశివరావు ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ హెల్త్ సూపర్వైజర్లు శివుడు అమర జ్యోతి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గార్లపాటి దాసు వైసీపీ పార్టీ జిల్లా సెక్రటరీ వైసీపీ మండల అధ్యక్షులు వేలది అప్పారావు సర్పంచ్ దేశి రెడ్డి సత్యనారాయణ బయ్యవరపు మస్తాన్రావు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Admin
VM టుడే న్యూస్