VM టుడే న్యూస్ - వార్తలు / పల్నాడు జిల్లా : వినుకొండ : జిల్లా సూపర్నెంట్ ఆఫ్ పోలీస్ వై.రవి శంకర్ రెడ్డి ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టడం జరిగిందని నరసరావుపేట డీస్పీ.మహేష్ తెలిపారు. వినుకొండ పట్టణ సమీపంలోని మార్కాపురం రోడ్డులోని అయ్యప్ప స్వామీ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను సీఐ లు వినుకొండ ఎస్ సాంబశివరావు, వినుకొండ రూరల్ సీఐ సుధాకర్ లతో కలిసి పరిశీలించారు. ఈ *సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా వినుకొండ మండలంలోని అందుగుల కొత్తపాలెం నుండి విటంరాజుపల్లి వరకు ప్రమాదాలు అధిక సంఖ్యలో జరుగుతుండటంతో రెడ్ జోన్ గా గుర్తించి బారికేడులు ఏర్పాటు చేయటం జరిగిందన్నారు వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేయాలనీ సూచించారు
Admin
VM టుడే న్యూస్