VM టుడే న్యూస్ - రాజకీయం / పల్నాడు జిల్లా : నిన్న సాయంత్రం ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ గెస్ట్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రివర్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని కలిసిన భారత జాతీయ దళిత క్రైస్తవ ఫోరం ఆధ్వర్యంలో ప్రోగ్రాం కన్వీనర్ అట్లూరి విజయ్ కుమార్ నాయకత్వంలో కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి వినతి పత్రం ఇవ్వటం జరిగింది ఈ యొక్క కలయిక ముఖ్య ఉద్దేశం దేశంలో ఉన్నటువంటి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని అయినటువంటి న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద పార్లమెంటు ముందు ఈనెల 18వ తారీకున దీక్ష చేపట్టడం జరుగుతుంది క్రైస్తవ హక్కుల కోసం, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ, బిసి హక్కుల కోసం ఏకం కావాలని క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని పలు రాష్ట్రాలు అసెంబ్లీలు తీర్మానం చేసి కేంద్రానికి పంపించగా బిజెపి ప్రభుత్వం ఇప్పటికీ కాలయాపన చేస్తూ దళితుల్ని పట్టించుకోకుండా దళితులను తుంగలో దక్కే ప్రయత్నం చేస్తూ ఉన్న విషయాన్ని ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వారికి తెలియజేయడం జరిగింది
అంతేకాకుండా ఈ విషయమై కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి మా వంతు కృషి సహాయ సహకారాలు క్రైస్తవులకు , క్రైస్తవ ఇతరులకు అండగా ఉంటామని మీరు చెప్పిన ఈ విషయాలపై మా యొక్క అధిష్టానానికి తెలియజేసి త్వరితగతిన న్యాయం జరిగేలాగా చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది అంతేకాక ఈ రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ని కలిసి పై విషయమై విన్నవించగా వారు కూడా సానుకూలంగా స్పందించి క్రైస్తవులకు అండగా ఎస్సీలకు అండగా ఏదైతే క్రైస్తవులు ఎస్సీ హోదా కావాలనుకుంటున్నారో వారి యొక్క విన్నపాన్ని మా యొక్క అధిష్టానానికి తెలియచేసి మీ యొక్క సమస్యను త్వరగా పరిష్కారం చేసే దిశగా మేము ప్రయత్నం చేస్తామని పురందర మాట ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్న రెవరెండ్ ఫాదర్స్, దళిత ఉద్యమ నేతలు మరియు పలనాడు జిల్లా, గుంటూరు జిల్లా అధ్యక్షులు ఘంటసాల ధర్మారావు గారు, జెల్డి మోజేష్ పల్లపు శ్రీనివాస్ మరికొందరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Admin
VM టుడే న్యూస్