VM టుడే న్యూస్ - రాజకీయం / పల్నాడు జిల్లా : వినుకొండ పట్టణంలోని 1వ వార్డు కళ్యాణపురి కాలనీ వద్ద ప్రభుత్వ ద్వారా సుమారు 3 కోట్ల రూపాయల తో విద్యుత్ మరమ్మత్తుల పనుల ను ప్రారంభించిన వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విద్యుత్ శాఖ అధికారులు
వినుకొండ నియోజకవర్గంలో నెలకొన్న ప్రధాన సమస్య విద్యుత్ సమస్య అని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెలియజేశారు. ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్ర స్థాయి లో మన సమస్య ను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వం ద్వారా సుమారు 3 కోట్ల రూపాయల తో వినుకొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రధాన సమస్య గా మారిన విద్యుత్ సమస్య పరిష్కారానికి, మరమ్మత్తుల పనులు నేటి నుండి ప్రారంభించామని రానున్న 2,3 నెలల్లో విద్యుత్ లోని అన్ని రకాల సమస్యలను తొలగించేలా యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తామని ప్రజలకు తెలియజేశారు. ప్రధానంగా విద్యుత్ సమస్య వినుకొండ పట్టణ లో ఉన్నందున ముందుగా వినుకొండ పట్టణం నుంచి ఈ కార్యక్రమాన్ని మెదలు పెట్టామని, పట్టణం తో పాటు అన్ని మండలాల గ్రామాల్లోని విద్యుత్ సమస్య ను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Admin
VM టుడే న్యూస్