VM టుడే న్యూస్ - వార్తలు / పల్నాడు జిల్లా : వైద్య ఆరోగ్యశాఖలో వివిధ హోదాల్లో పనిచేసే 33 సంవత్సరములు సర్వీసు దిగ్విజయంగా పూర్తి చేసుకునీ ప్రస్తుతం క్రోసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య విస్తరణ అధికారిగా పనిచేస్తున్న శిఖా శాంసన్ ను శుక్రవారం "శ్యామ్"మిత్రమండలి ఆధ్వర్యంలో క్రోసూరులో పూలదండ శాలువా బొకేలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వైద్య అధికారులు డాక్టర్ రమాదేవి డాక్టర్ అంకమ్మ బాయ్ డాక్టర్ సాద్ డాక్టర్ సిరి చందన లు శాంసన్ ను బొకేతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం క్రోసూరు ఎస్టి కాలనీలో పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వైద్యాధికారులు మాట్లాడుతూ విధి నిర్వహణయే ఘనతకు మార్గమని శాంసన్ వైద్య ఆరోగ్య శాఖలో మరిన్ని ప్రమోషన్లు పొందాలని పేద ప్రజలకు ఉపయోగపడాలని వారు అభిలాషించారు
ఈ సందర్భంగా శ్యామ్ మిత్రమండలి కార్యదర్శి జానీ భాష మాట్లాడుతూ పెదకూరపాడు సత్తనపల్లి నియోజకవర్గాల్లో శాంసన్ వైద్య ఆరోగ్య శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తూ సాంఘిక సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను ప్రజల ముంగిటకు తీసుకు వెళ్ళుటకు ఆయన చేస్తున్న కృషి అభినందించదగినదని కొని ఆడారు సేవా తత్పరులను నిరంతరం గౌరవించాలని పేర్కొన్నారు ప్రభుత్వ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలకు నిత్యం కృషి చేస్తున్న శాంసన్ ను సత్కరించటం ఆనందంగా ఉందన్నారు కరోనా సమయంలో నియోజకవర్గంలో ఆయన చేసిన సేవలు అమోఘమని పేర్కొన్నారు ఈ సందర్భంగా శాంసన్ మాట్లాడుతూ తనకు జరిగిన సన్మానం పట్ల కృతజ్ఞతలు తెలిపారు
భవిష్యత్తులో వైద్య ఆరోగ్య శాఖలో తన వంతుగా సేవలందించడానికి తన శక్తివంతం లేకుండా కృషి చేస్తానన్నారు ఇకముందు కూడా ఇదే స్ఫూర్తితో మరింత సేవా దృక్పథంతో ఆరోగ్య శాఖలో తన వంతు సేవలు కొనసాగుతాయని శాంసన్ స్పష్టం చేశారు ప్రధానంగా ఉన్నతాధికారుల ప్రోత్సాహం సిబ్బంది సహకారం ప్రజల సహకారంతో తన సక్సెస్ ఫుల్ కెరీర్ కు పునాది వేసినట్లు శాంసన్ తెలిపారు ఈ కార్యక్రమంలో షేక్ మస్తాన్ పోతుగంటి శ్రీనివాసరావు పోతుగంటి లక్ష్మయ్య వెంకటేశ్వర్లు సింగర్ మస్తాన్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
Admin
VM టుడే న్యూస్