VM టుడే న్యూస్ - రాజకీయం / పల్నాడు జిల్లా : అక్రమ అరెస్టుతో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి సంఘీభావంగా నరసరావుపేట పట్టణంలో స్థానిక 08 వార్డ్ నందు నిర్వహించిన కాంతితో క్రాంతి కార్యక్రమంలో నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు.లైట్లు ఆపి,కొవ్వొత్తులు వెలిగించి వైసీపీ ప్రభుత్వ తీరు పై నిరసన తెలిపారు.సేవ్ ఏపి సేవ్ డెమోక్రసీ మేము సైతం బాబు కోసం నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
VM టుడే న్యూస్