VM టుడే న్యూస్ - వార్తలు / పల్నాడు జిల్లా : మాచర్ల పట్టణం స్థానిక పాతూరు అంబేద్కర్ విగ్రహం వద్ద నియోజకవర్గంలోని మాలలతో ఆత్మీయ సమావేశం చింతమళ్ళ శ్రీనివాసరావు అధ్యక్షతన ఏర్పాటు చేయగా ముఖ్యఅతిథిగా మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు డా గోదా జాన్ పాల్ పాల్గొని మొదటగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ధన నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పల్నాడు అనగానే మొదటగా గుర్తొచ్చేది వేలాది మంది శత్రువులను ఒంటిచేత్తో మట్టి కరిపిచ్చిన మాల కన్నమ దాసు అలాంటి వ్యక్తి వారసులైన మాలలలో ఐక్యత లోపించుట చాలా బాధాకరమని ఐక్యతతో పెద్ద పోరాటాలకు పిలుపునివ్వచ్చని రానున్న రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో గ్రామస్థాయిలో మాల మహానాడు కమిటీ ఏర్పాటు చేసి నూతనంగా ఏర్పాటైన పల్నాడు జిల్లాలో మాలల ఉనికి ఆయా రాజకీయ పార్టీలలో మాలల ప్రాధాన్యతపై భవిష్యత్తులో జిల్లా లో పల్నాడు మాలల పోరుగర్జన నిర్వహించనున్నట్లు నిరుద్యోగులుగా ఉన్న యువత చెడు వ్యసనాలకు దగ్గర అవకుండా గ్రామ గ్రామాన అంబేద్కర్ ఆలోచన విధానంతో పనిచేయటానికి యువత ముందుకు రావాలని త్వరలో పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో జిల్లా ఆత్మీయ సమావేశం జరగనుందని ఈ సమావేశానికి మాచర్ల నియోజకవర్గంతో పాటు జిల్లాలోని మాలలు,ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు వేలాదిగా తరలిరావాలని డా గోదా జాన్ పాల్ పిలుపునిచ్చారు
కార్యక్రమం అనంతరం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు డా గోదా జాన్ పాల్ మరియు జిల్లా ఉపాధ్యక్షులు కొండ్రు విజయ్ కి పూలమాలలు మరియు దుశ్యాలువాతో ఘనంగా సత్కరించడం జరిగింది ఈ సమావేశంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కొండ్రు విజయ్, సోషల్ మీడియా పల్నాడు జిల్లా ఇన్చార్జి గోదాబాల, బొబ్బిలి చంద్రశేఖర రావు, దాసి మల్లికార్జునరావు, మరికంటి రవికుమార్, నాగేండ్ల వెంకటేశ్వర్లు,కొండా శ్రీనివాసరావు, దొడ్డ దుర్గారావు, జొన్నలగడ్డ శ్రీను, కొమ్ము విజయకుమార్, దొడ్డ వెంకటేశ్వర్లు, విజయపురి సౌత్ సాయి, సాతులూరి కృష్ణ, దొడ్డ సాంబశివరావు, దాసరి ముక్క0టేశ్వరరావు చింతమళ్ళ శ్రీనివాసరావు, నాగేండ్ల దశరథ రామ్, చిన్న చెన్నయ్య బుట్టి రాంబాబు,దొడ్డ చంద్రశేఖర రావు బుట్టి మారుతి కిరణ్ తదితరులు పాల్గొన్నారు
Admin
VM టుడే న్యూస్