Friday, 08 December 2023 08:49:26 PM
# డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన # ఐదు సంవత్సరాల లోపు చిన్నారులలో నిమోనియా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి # మద్యం కంపెనీల యజమానుల పేర్లు ప్రజాక్షేత్రంలో పెట్టగలరా?: పురందేశ్వరి # ఆరోగ్య సురక్ష క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: క్రోసూరు మండల స్పెషల్ ఆఫీసర్ # పాస్‌పోర్ట్‌ ప్రత్యేక డ్రైవ్‌ # వైయస్ఆర్సీపీ నాయకుడు చింతపల్లి రవి భార్య అకాల మరణం: పరామర్శించిన జల వనరుల శాఖ మంత్రి # చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చంద్రబాబు # వైసీపీని తరిమికొడతారు:నేను సైతం నిరాహారదీక్షలో ఐటీడీపీ నాయకులు 27వ రోజు కొనసాగిన దీక్ష # మాచర్ల నియోజకవర్గం మాలల ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథిగా మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు డా గోదా జాన్ పాల్ # వైసీపీకి పుట్టగతులుండవ్‌:సైకో పోవాలి - సైకిల్ రావాలి:నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు # శ్యామ్ మిత్రమండలి ఆధ్వర్యంలో శిఖ శాంసన్ కు ఘన సత్కారం # విద్యుత్ సమస్య కు శాస్వత పరిస్కారం: బొల్లా బ్రహ్మనాయుడు # ఏలూరు కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుల అరెస్ట్:క్రైమ్ సినిమాను తలపించిన ఏలూరులో కిడ్నాప్ ఘటన # ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు నల్లారి కిరణ్ మరియు బిజెపి అధ్యక్షులు దగ్గుబాటి పురందరేశ్వరిని కలిసిన.. అట్లూరి # గుడిపాడు లో జగనన్న ఆరోగ్య సురక్ష # చిలకలూరిపేట మండలం లింగుంట్ల వద్ద పిడుగుపాటు... # మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి కి చిత్రపటానికి నివాళులు అర్పించిన బొర్రా # రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి # కారంపూడిలో ఘనంగా గాంధీజయంతి వేడుకలు # విలేకరులకు స్థలాలు ఇప్పించేందుకు కృషి చేస్తా : పల్నాడు జిల్లా పాత్రికేయుల అధ్యక్షుడు పివిఆర్ యాదవ్

చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చంద్రబాబు

రాజమండ్రి

Date : 13 October 2023 12:26 PM Views : 68

VM టుడే న్యూస్ - వార్తలు / తూర్పుగోదావరి జిల్లా : రాజమండ్రి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో జ్యుడిషియల్‌ రిమాండ్‌ అనుభవిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. కొన్ని రోజులుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. తీవ్ర ఎండ, ఉక్కపోత కారణంగా అలర్జీతో ఇబ్బందులు పడుతున్నట్టు తెలిసింది. ఇదే విషయాన్ని చంద్రబాబు జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన జైలు అధికారులు రాజమండ్రిలోని బోధనాస్పత్రి, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహాలక్ష్మికి గురువారం సమాచారం ఇచ్చారు.

వైద్యులను పంపాలని లేఖలో కోరారు. వెంటనే స్పందించిన జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ఇద్దరు చర్మ సంబంధిత వ్యాధి నిపుణులను కేటాయించారు. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జి.సూర్యనారాయణ, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సీహెచ్‌.సునీతాదేవి సెంట్రల్‌ జైలుకు వెళ్లి చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేపట్టారు. పరీక్షల అనంతరం వైద్యులు ఎలాంటి వివరాలు వెల్లడించకుండా తిరిగి జీజీహెచ్‌కు వెళ్లిపోయారు.వైద్య పరీక్షల్లో వెల్లడైన ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్టు సమాచారం. సెంట్రల్‌ జైల్‌ డిప్యూటీ సూపరింటెండెంట్‌ రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ.. చంద్రబాబుకు అలర్జీ ఉందని చెప్పడంతో చర్మ వైద్యుల్ని పిలిపించి వైద్య పరీక్షలు నిర్వహించినట్టు చెప్పారు. అవసరమైన మందులు సూచించినట్టు వెల్లడించారు. వైద్యులు చెప్పిన మందులను చంద్రబాబుకు అందజేసినట్టు చెప్పారు.

చంద్రబాబు ఆరోగ్యానికి డోకా లేదు చంద్రబాబు చర్మ వ్యాధి బారినపడిన నేపథ్యంలో జైలు అధికారులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. బీపీ 140/80 ఎంఎంహెచ్‌జీ, టెంపరేచర్‌ నార్మల్‌గా ఉందన్నారు. పల్స్‌ రేట్‌ 87 నిమిషానికి ఉందని, ఊపిరితిత్తుల్లో ఎలాంటి సమస్య లేదని వెల్లడించారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు

Madhu

Admin

VM టుడే న్యూస్

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2023. All right Reserved.

Developed By :