VM టుడే న్యూస్ - వార్తలు / పల్నాడు జిల్లా : ముప్పాళ్ళ మండల పరిధిలోని బొల్లారం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి నాయకులు చింతపల్లి రవి భార్య లక్ష్మమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. శుక్రవారం సమాచారం తెలుసుకున్న రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు లక్ష్మమ్మ పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మంత్రి అంబటితో పాటు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు తదితరులున్నారు.
Admin
VM టుడే న్యూస్