VM టుడే న్యూస్ - ఆరోగ్యం / పల్నాడు జిల్లా : ఆరోగ్య సురక్ష క్యాంపులను ప్రజల సద్వినియోగం చేసుకోవాలని పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండల స్పెషల్ ఆఫీసర్ పద్మశ్రీ పేర్కొన్నారు శుక్రవారం పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఆవుల వారి పాలెం గ్రామంలోని పాఠశాలలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపును స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీవో మహేష్ ఎమ్మార్వో శ్రీనివాసరావు ల తో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలకు ఏడు రకాల పరీక్షలు చేసి ఏమైనా బిపి షుగర్ దీర్ఘకాలికమైన రోగాలు వచ్చే సూచనలే ఏమైనా ఉన్నాయా అని తెలుసుకుంటారు అన్నారు అదే గ్రామంలో 15 రోజుల తర్వాత జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు ఏర్పాటు చేసి ఆ గ్రామంలో నివసిస్తున్న ప్రజలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అని దానిమీద ప్రొఫైల్ ఐడి తయారు చేసుకొని అవసరమైన వారికి మందులు అందించటం జరుగుతుందన్నారు
ఈ శిబిరానికి వచ్చిన రోగులకు డాక్టర్ మహమ్మద్ సాద్ డాక్టర్ బాల అంకమ్మ భాయ్ డాక్టర్ చంద్ర తేజ డాక్టర్ విశ్వనాథ్ డాక్టర్ సిరి చందన రోగులను పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ రమేష్ ఎంపీపీ పెరుమాళ్ళ కోటయ్య సొసైటీ అధ్యక్షులు అనుముల కోటిరెడ్డి ఏఎంసీ వైస్ చైర్మన్ గార్లపాటి దాసు తిప్పిరెడ్డి అప్పిరెడ్డి అప్పారావు మాజీ యార్డ్ చైర్మన్ డాక్టర్ షరీఫ్ కేశవరెడ్డి పెరికపాడు సర్పంచ్ శ్రీధర్ ఉపసర్పంచ్ మస్తాన్రావు వైస్ ప్రెసిడెంట్ శివ నాగిరెడ్డి ఎంపీటీసీ నాగేశ్వర రావు ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ హెల్త్ సూపర్వైజర్లు శివుడు ఆమర జ్యోతి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అమీర్ ఆరోగ్య కార్యకర్త మల్లేశ్వరి అంగన్వాడి సూపర్వైజర్ రత్న కుమారి ఫార్మసిస్ట్ ఫాతిమా తదితరులు పాల్గొన్నారు శిబిరానికి వచ్చిన రోగులందరికీ జగనన్న ఆరోగ్య సురక్ష సంచులను పంపిణీ చేశారు
Admin
VM టుడే న్యూస్