VM టుడే న్యూస్ - రాజకీయం / N T R జిల్లా : ఏపీలో మద్యం తయారీ కంపెనీల యజమానుల పేర్లు ప్రజాక్షేత్రంలో పెట్టగలరా అని రాష్ట్ర భాజపా అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రశ్నించారు ఇవాళ సాయంత్రానికల్లా కంపెనీ యజమానుల పేర్లు బయట పెట్టాలని డిమాండ్ చేశారు విజయవాడలో మీడియాతో ఆమె మాట్లాడారు. ఆ కంపెనీల యజమానులంతా వైకాపా వాళ్లేనని వేరే చెప్పనవసరం లేదని దుయ్యబట్టారు. ధైర్యం ఉంటే మద్యం కంపెనీల యజమానుల పేర్లన్నీ బయటపెట్లాని సవాల్ విసిరారు మద్యం తయారు చేసినా అమ్మినా ఏడేళ్ల జైలు శిక్ష విధించాలని గతంలో సీఎం జగన్ చెప్పారని ఈ సందర్భంగా పురందేశ్వరి గుర్తుచేశారు.
Admin
VM టుడే న్యూస్