VM Today News - వార్తలు / పల్నాడు : పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతితులకు ప్రజా సంఘాలు విజ్ఞప్తి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లాలో అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దాడి చేసుకుని జిల్లాలో ప్రజా జీవనానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పాటు చేశారు. దీనివలన చిరు వ్యాపారులు, కూలీలు, మధ్యతరగతి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు పదే పదే 144 సెక్షన్ల పేరుతో షాపులు ముగించడం వలన, ఒక రకమైనటువంటి కర్ఫ్యూ పరిస్థితులు పల్నాడు జిల్లాలో నెలకొన్నాయి. ఎన్నికలు జరిగి,ఫలితాలు వచ్చినా,చిన్న చిన్న చెదురు మదురు సంఘటనలు జరుగుతున్నాయి, కొత్తగా ఏర్పాటు చేయబోయే ప్రభుత్వం దీనిని అదుపు చేయాలి, కానీ తరచూ పల్నాడు జిల్లాలో షాపులు బందులు చేస్తే సాధారణ ప్రజలు బ్రతకడం కష్టమవుతుంది, కొత్తగా అధికారం చేపట్టబోతున్న ప్రజా ప్రతినిధులు ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి కార దాడులు నివారించేలా తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజా జీవనానికి ఆటంకం లేకుండా చూడాలని ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు హింసాత్మక ఘటనలకు, అల్లర్లకు పాల్పడకుండా ప్రజల క్షేమాన్ని కోరి శాంతి యుతంగా సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాము. కే. శ్రీనివాసరావు దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఓర్సు కృష్ణ ఎం సిపిఐ పల్నాడు జిల్లా అధ్యక్షులు
Admin
VMToday News