Monday, 09 December 2024 04:24:39 AM
# గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # నూతనంగా పెద్దలకు టీబీ వ్యాక్సిన్ వైద్యాధికారిని బాల అంకమ్మ బాయ్ # అధిక రక్తపోటుతో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విస్తరణాధికారి శిఖా శాంసన్ # డెంగ్యూ వ్యాధిని అరికట్టటం మన అందరి బాధ్యత: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యువనాయకులు కన్నా నాగరాజు # బొల్లా బ్రహ్మనాయుడు నీ పని అయిపోయింది # క్రోసూరు కళావైభవాన్ని తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి చేసిన కళాకారుడు సుప్రసిద్ధ హార్మోనిస్ట్ లయ బ్రహ్మ స్వర్గీయ షేక్ కుదా వన్ # ఆర్యవైశ్యులకు అండగా నిలిచే డా౹౹చదలవాడ అరవింద బాబుని గెలిపించుకుందాం # లోక్‌సభకు 965, అసెంబ్లీకి 5,460 నామినేషన్లు # ఎన్నికల ప్రచారంలో మాజీ మేయర్ # సమాజమే దేవాలయమనేది మన నినాదం సమాజం ఉన్నదే దోపిడీకి అనేది వైసీపీ నినాదం వైద్యుల్ని కూడా వేధించిన దుర్మార్గుడైన జగన్ రెడ్డి,గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి # ఇంటింటికి కరపత్రాలు పంచుతూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న:బొర్రా # గోపిరెడ్డికి వణుకు పుట్టిస్తున్న టిడిపి చేరికలు: డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు జేజేలు కొడుతున్న ప్రజలు # క్రోసూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి బాల అంకమ్మ బాయ్ ఆధ్వర్యంలో మలేరియా పై అవగాహన సదస్సు # మానవ హక్కుల ప్రదాత బి.ఆర్ అంబేద్కర్: APGEA క్రోసూరు యూనిట్ అధ్యక్షులు శిఖా శాంసన్

నూతనంగా పెద్దలకు టీబీ వ్యాక్సిన్ వైద్యాధికారిని బాల అంకమ్మ బాయ్

క్రోసూరు

Date : 23 May 2024 06:06 PM Views : 177

VM Today News - ఆరోగ్యం / పల్నాడు : జాతీయ టిబి నిర్మూలన లక్ష్యాన్ని సాధించేందుకు 20 25 వ సంవత్సరం నాటికి క్షయ వ్యాధిని అంతం చేయడానికి, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ భారతదేశ ప్రభుత్వం/రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి బలహీనమైన వ్యక్తులకు మరియు పెద్ద వయసు ఉన్నవారికి బీసీజీ టీకాను ఇవ్వాలని నిర్ణయించినట్లు పల్నాడు జిల్లా కోసూరు మండలం క్రోసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని బాల అంకమ్మ బాయ్ గురువారం తెలిపారు టీబి వ్యాధి రావడానికి ఎక్కువ అవకాశం ఉన్న పెద్ద వయసు ఉన్న వారికి బీసీజీ టీకా ఇవ్వడం ద్వారా సమాజంలో క్రొత్త టీబి కేసుల సంఖ్య తగ్గింపు జరుగుతుందన్నారు ఈ వయోజన బీసీజీ టీకా వేయించుకోవడానికి అర్హులైన వారి గూర్చి ఆమె వివరించారు మధుమేహ వ్యాధిగ్రస్తులు, 60 సంవత్సరముల వయసు దాటిన వారు అందరూ, గత ఐదు సంవత్సరముల క్రితం 18 సంవత్సరములు నిండిన టీబి వ్యాధికి గురైన వారు, 1 జనవరి 2021 తర్వాత టీబీ వ్యాధి గురి అయిన వారి యొక్క కుటుంబ సభ్యులకు మరియు వారితో అత్యంత సన్నిహితంగా ఉన్న వారికి, బాడీ మాస్ ఇండెక్స్ 18 కేజీలు/చదరపు మీటరు కన్నా తక్కువ ఉన్నవారికి, గతంలో గాని ఇప్పుడు గాని పొగ త్రాగే అలవాటు ఉందని స్వచ్ఛందంగా తెలిపిన వారికి ఈ అడల్ట్ బిసిజి టీకా కు అర్హులని ఆమె పేర్కొన్నారు ఈనెల 30వ తేదీ గురువారం మరల మండలంలోని అన్ని సచివాలయాల్లో ఈ వయోజనుల బీసీజీ టీకా కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు ఈ సందర్భంగా ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ మాట్లాడుతూ వయోజన బీసీజీ టీకా వేయించుకోవడానికి అర్హులు కాని వారి గూర్చి ఆయన వివరించారు 18 సంవత్సరముల లోపు వయసు ఉన్న వ్యక్తులు, హెచ్ఐవి సోకిన వారు, గర్భవతులు, గుండె సంబంధిత వ్యాధులకు చికిత్స తీసుకుంటున్న వారు, డయాలసిస్ కానీ క్యాన్సర్ వ్యాధికి చికిత చేయించుకుంటున్న వారు ఈ అడల్ట్ బి సి జి వ్యాక్సిన్ వేయించుకోకూడదు అని ఆయన పేర్కొన్నారు ఈ వయోజన బీసీజీ టీకా కొరకు ప్రతి సచివాలయం ఆరోగ్య కార్యకర్తను గాని ఆశా కార్యకర్తను గాని సంప్రదించవలసిందిగా ఆయన కోరారు ఈ అవకాశాన్ని అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగ పరుచుకొన వలసిందిగా ఆయన తెలిపారు


VM Today News

Admin

VMToday News

Copyright © VM Today News 2024. All right Reserved.

Developed By :