VM Today News - ఆరోగ్యం / పల్నాడు : రోగి ప్రాణాలు కాపాడే విషయంలో వైద్యులు పడే శ్రమ వర్ణానతీతం అని అందుకే వైద్యులను దైవ స్వరూపులుగా పోల్చుతారని ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ అన్నారు సోమవారం జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా పలనాడు జిల్లా సత్తెనపల్లిలో నరసరావుపేట ఏరియా హాస్పిటల్ లో సూపర్డెంట్ గా పనిచేస్తున్న డాక్టర్ మంత్రు నాయక్ కు ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ బొకే అందజేసి, శాలువా కప్పి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు అనంతరం శాంసన్ డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ చిత్రపటానికి పూలదండ వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా శాంసన్ మాట్లాడుతూ బి. సి రాయ్ తన జీవిత పర్యంతము దేశీయ వైద్య రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు అవిశ్రాంతంగా కృషి చేశారన్నారు విద్యావేత్త, స్వాతంత్ర సమరయోధుడు అయినా డాక్టర్ రాయ్ 1948 నుంచి 1962 వరకు 14 ఏళ్ల పాటు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేశారన్నారు యాదృచ్ఛికంగా 1962 జూలై 1వ తేదీన డాక్టర్ రాయ్ మరణించారు ఆయన పుట్టిన తేదీ మరణించిన రోజు ఒకటే కావటంతో మన దేశంలో ప్రతి సంవత్సరం జూలై ఒకటో తేదీన జాతీయ వైద్య దినోత్సవం జరుపుకుంటారన్నారు బీసీ రాయ్ కలకత్తాలో ప్రాక్టీస్ ప్రారంభించి కలరా విజృంభించి నా సమయంలో వేలాదిమంది ప్రాణాలను కాపాడారన్నారు జాతిపిత మహాత్మా గాంధీకి వైద్యుడిగా, స్నేహితుడిగా వెన్నంటి నడిచాడని పేర్కొన్నారు 1961 లో భారతరత్న పురస్కారం అందుకున్నారు 2024 లో జాతీయ వైద్యుల దినోత్సవం జరుపుకోవడానికి ఎంచుకున్న థీమ్ హీలింగ్ హాండ్స్, కేరింగ్ హార్ట్ లు ఇది వైద్యుల వారి వైద్య అభ్యాసానికి తీసుకువచ్చే అంకితభావం, కరుణ మరియు సానుభూతిని అలాగే సేవ చేయడంలో మరియు మెరుగుపరచటంలో వారి పోషిస్తున్న కీలకపాత్రను నొక్కి చెబుతుంది అన్నారు ఎందరో డాక్టర్లు తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ బాధితులకు 24 గంటలు సేవలందిస్తున్నారని వైద్యో నారాయణ హరి అనే పదానికి అర్థం ఇచ్చేలా వారు చేస్తున్న సేవ ప్రశంసించదగ్గదని చిర స్మరణీయమని ఆయన పేర్కొన్నారు పలు కారణాలవల్ల వైద్యులు రోగులు మధ్య సంబంధాలు పరస్పర విశ్వాసం సన్నగిల్లుతుండటం విషాదకరం అని అన్నారు
Admin
VMToday News