VM Today News - ఆరోగ్యం / పల్నాడు : అధిక రక్తపోటుతో జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ అన్నారు శుక్రవారం ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా ఆయన పల్నాడు జిల్లా కోసూరు మండలం గుడిపాడు ఆరోగ్య ఉప కేంద్రంలో ప్రజలచే ప్రతిజ్ఞ చేయించారు తరచుగా బీపీ చెక్ చేయించుకుందునని యు, మరియు తప్పకుండా బీపీకి మందులు వాడుదునని యు వైద్య అధికారుల సూచనల మేరకు జీవన శైలిలో మార్పులు చేసుకుంటామని యు ప్రజలచే శాంసన్ ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ దివ్య మాట్లాడుతూ వ్యాయామం, ఆహారంలో ఉప్పు, కారాలను తగ్గించడం, మద్యపానం ధూమపానం ఆపేయటం వంటివి హై బీపీ నియంత్రణలో ఉపకరిస్తాయని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త ఝాన్సీ ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Admin
VMToday News