Saturday, 22 June 2024 05:07:21 AM
# పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # నూతనంగా పెద్దలకు టీబీ వ్యాక్సిన్ వైద్యాధికారిని బాల అంకమ్మ బాయ్ # అధిక రక్తపోటుతో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విస్తరణాధికారి శిఖా శాంసన్ # డెంగ్యూ వ్యాధిని అరికట్టటం మన అందరి బాధ్యత: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యువనాయకులు కన్నా నాగరాజు # బొల్లా బ్రహ్మనాయుడు నీ పని అయిపోయింది # క్రోసూరు కళావైభవాన్ని తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి చేసిన కళాకారుడు సుప్రసిద్ధ హార్మోనిస్ట్ లయ బ్రహ్మ స్వర్గీయ షేక్ కుదా వన్ # ఆర్యవైశ్యులకు అండగా నిలిచే డా౹౹చదలవాడ అరవింద బాబుని గెలిపించుకుందాం # లోక్‌సభకు 965, అసెంబ్లీకి 5,460 నామినేషన్లు # ఎన్నికల ప్రచారంలో మాజీ మేయర్ # సమాజమే దేవాలయమనేది మన నినాదం సమాజం ఉన్నదే దోపిడీకి అనేది వైసీపీ నినాదం వైద్యుల్ని కూడా వేధించిన దుర్మార్గుడైన జగన్ రెడ్డి,గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి # ఇంటింటికి కరపత్రాలు పంచుతూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న:బొర్రా # గోపిరెడ్డికి వణుకు పుట్టిస్తున్న టిడిపి చేరికలు: డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు జేజేలు కొడుతున్న ప్రజలు # క్రోసూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి బాల అంకమ్మ బాయ్ ఆధ్వర్యంలో మలేరియా పై అవగాహన సదస్సు # మానవ హక్కుల ప్రదాత బి.ఆర్ అంబేద్కర్: APGEA క్రోసూరు యూనిట్ అధ్యక్షులు శిఖా శాంసన్ # ప్రజలకు జవాబుదారితనంగా సేవలు అందించాల్సిన ప్రభుత్వ శాఖలోనే: ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి భారీ మొత్తంలో ముడుపులు!! # పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యానికి భద్రత: వైద్యాధికారిణి బాల అంకమ్మ భాయ్ # ఎండ దెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వేసవికాలంలో జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి: ఆరోగ్య విస్తరణ అధికారి # క్షయ నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్

ప్రజలకు జవాబుదారితనంగా సేవలు అందించాల్సిన ప్రభుత్వ శాఖలోనే: ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి భారీ మొత్తంలో ముడుపులు!!

రాజుపాలెం

Date : 11 April 2024 05:28 PM Views : 272

VM Today News - వార్తలు / పల్నాడు : రాజుపాలెం :- ప్రజలకు జవాబు దారితనంగా సేవలు అందించాల్సిన ప్రభుత్వ శాఖలలోని అధికారులు అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి భారీ మొత్తాలలో ముడుపులు అందుకుంటూ ప్రభుత్వ నిబంధనలు కాలరాస్తూ అవినీతి సామ్రాజ్యాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒకవైపు ఏసీబీ అధికారులు అవినీతి సామ్రాట్‌లుగా వ్యవహరించే వారి భరతం పడుతున్నా కొంతమంది అవినీతి అధికారులు జంకుబెంకు లేకుండా పైసా వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ శాఖలలోని ఉద్యోగులకు రాజ్యాంగం కల్పించిన అవకాశాలను అడ్డగోలుగా వాడుకుంటూ ప్రజలను జలగల్లా పీక్కు తింటున్నారు. ఇప్పుడు ఏకంగా రాజుపాలెం రెవెన్యూ అధికారులు ప్రభుత్వం నిధులుకే గండికోడుతున్నారు.జగనన్న భూరక్ష పేరుతో ప్రభుత్వం భూమికి డ్రోన్లతో సర్వే నిర్వహించి సర్వే పూర్తి చేశారు హద్దురాళ్లు పాతేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. నిధుల్లో భాగంగా ఒక్కొక్క రాయికి రూ.150 /- ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైనట్లు అధికారులు తెలిపిన్నారు. కానీ రాజుపాలెం మండలంలో హద్దురాలను పాతేందుకు 105 రూపాయలు కూలి చెల్లించి కొన్ని రాళ్లు పాతకుండా ఊరు చివర పొలాల్లో వదిలిపెట్టిన్నారు. మండలలోని చౌటపాపాయపాలెం గ్రామానికి 1397 రాళ్లు, రాజుపాలెం గ్రామానికి 1390 రాళ్లు, రెడ్డిగూడెం గ్రామానికి 1390 రాళ్ల చొప్పున మొత్తం 4177 సర్వే రాళ్లులను పంపియున్నారు. హద్దుల నిమిత్తం ఒక్కొక్క రాయి నిర్మించేందుకు రాయికి 150 రూపాయలు చొప్పున ప్రభుత్వం నుండి సుమారు రూ..6.26,550 నిధులు విడుదల చేసినట్లు తెలిపియున్నారు. కానీ మండల సర్వేలు కూలీలకు 105 రూపాయలు చెల్లించి మిగిలిన 45 రూపాయలు చొప్పున 1.87.965 /- రూ రవాణా చెల్లింపు తదితర ఖర్చుల పేరుతో తన జేబులో వేసుకున్నట్లు తెలుస్తుంది. సచివాలయం అధికారుల స్థాయి నుండి రెవిన్యూలో పై అధికారుల స్థాయి వరకు అందరికి ముడుపులు అందటంతో ఎవరిని ఏమి అడిగిన పొంతన లేని సమాధానం చెప్తూ తప్పించుకుంటున్నారు.ఇప్పటికైన దీనిపై జిల్లా స్థాయి అధికారులు స్పందించి జరిగిన అవినీతిని వెలికితీసి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామ ప్రజలు కోరుతున్నారు .దీనిపై మండల ఇన్ఛార్జ్ తాసిల్దార్ వివరణ కోరగా మండల సర్వేయర్ రిపోర్ట్ అడిగానని రిపోర్టును పరిశీలించి ఆర్డీవోకి పంపిస్తానని తెలిపారు.


VM Today News

Admin

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2024. All right Reserved.

Developed By :