VM Today News - రాజకీయం / పల్నాడు : సత్తెనపల్లి పట్టణంలో ఒక్కటో వ వార్డ్ ప్రతి ఇంటికి వెళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గుంటూరు నగర మాజీ మేయర్ సత్తెనపల్లి నియోజకవర్గ యువ నాయకులు కన్నా నాగరాజు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కన్నా నాగరాజు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచి ఎన్నికల మేనిఫెస్టో గురించి తెలియజేశారు. కన్నా నాగరాజు మాట్లాడుతూ..... మహాశక్తి పేరుతో ప్రకటించిన పథకం ద్వారా తల్లికి వందనం కింద బిడ్డలను చదివించేందుకు ఒక్కొక్కరికి 15000 ఇవ్వనున్నారు.ఆడపడుచులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నారు.సాగు భారమై రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వారికి అండగా ఉండేందుకు సంవత్సరానికి ₹20,000 ఆర్థిక సహాయం చేస్తామని వెల్లడించారు. 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తామని, ఇంటింటికి ఉచితంగా రక్షిత తాగునీటి కల్పించనున్నారు. పేదరికం రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణని మరియు లావు శ్రీకృష్ణదేవరాయలుని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మండల గ్రామ నాయకులు తెలుగుదేశం జనసేనపార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు...
Reporter
VMToday News