Thursday, 16 May 2024 10:20:03 AM
# ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యువనాయకులు కన్నా నాగరాజు # బొల్లా బ్రహ్మనాయుడు నీ పని అయిపోయింది # క్రోసూరు కళావైభవాన్ని తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి చేసిన కళాకారుడు సుప్రసిద్ధ హార్మోనిస్ట్ లయ బ్రహ్మ స్వర్గీయ షేక్ కుదా వన్ # ఆర్యవైశ్యులకు అండగా నిలిచే డా౹౹చదలవాడ అరవింద బాబుని గెలిపించుకుందాం # లోక్‌సభకు 965, అసెంబ్లీకి 5,460 నామినేషన్లు # ఎన్నికల ప్రచారంలో మాజీ మేయర్ # సమాజమే దేవాలయమనేది మన నినాదం సమాజం ఉన్నదే దోపిడీకి అనేది వైసీపీ నినాదం వైద్యుల్ని కూడా వేధించిన దుర్మార్గుడైన జగన్ రెడ్డి,గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి # ఇంటింటికి కరపత్రాలు పంచుతూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న:బొర్రా # గోపిరెడ్డికి వణుకు పుట్టిస్తున్న టిడిపి చేరికలు: డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు జేజేలు కొడుతున్న ప్రజలు # క్రోసూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి బాల అంకమ్మ బాయ్ ఆధ్వర్యంలో మలేరియా పై అవగాహన సదస్సు # మానవ హక్కుల ప్రదాత బి.ఆర్ అంబేద్కర్: APGEA క్రోసూరు యూనిట్ అధ్యక్షులు శిఖా శాంసన్ # ప్రజలకు జవాబుదారితనంగా సేవలు అందించాల్సిన ప్రభుత్వ శాఖలోనే: ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి భారీ మొత్తంలో ముడుపులు!! # పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యానికి భద్రత: వైద్యాధికారిణి బాల అంకమ్మ భాయ్ # ఎండ దెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వేసవికాలంలో జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి: ఆరోగ్య విస్తరణ అధికారి # క్షయ నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # రంజాన్ నెల శుభాకాంక్షలు: శ్యామ్ మిత్రమండలి అధ్యక్షులు శిఖా శాంసన్ # దోమల నిర్మూలనలో ప్రజాభాగ్యస్వామ్యం తప్పనిసరి వైద్యాధికారిని బాల అంకమ్మ భాయ్ ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # నేటి సమాజానికి స్ఫూర్తి_ _రేపటి సమాజానికి వెలుగు "మహిళ" వైద్యాధికారిణి సిరి చందన-ఏపీజిఇఏ అధ్యక్షులు శిఖా శాంసన్ # A M రెడ్డి విద్యాసంస్థల ప్రెసిడెంట్ కన్నుమూత # గుంటూరు అసెంబ్లీ లేదా పార్లమెంట్ సీటుని సాధించడంలో పట్టువీడని విక్రమార్కుడిగా- తాడువాయి రామకృష్ణ

క్రోసూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి బాల అంకమ్మ బాయ్ ఆధ్వర్యంలో మలేరియా పై అవగాహన సదస్సు

Date : 25 April 2024 07:52 PM Views : 70

VM Today News - వార్తలు / పల్నాడు : మలేరియా పై ప్రజల్లో అవగాహన అవసరం వైద్యాధికారిని బాల అంకమ్మ భాయ్ మలేరియా వ్యాధి దోమ కాటు వలన వచ్చే వ్యాధి అని, ఎనాఫిలాస్ జాతికి చెందిన ఆడ దోమ కాటు తో ఈ వ్యాధి వస్తుందని ఈ వ్యాధి ఎక్కువగా పారిశుద్ధ్య లోపం సరైన ఆరోగ్యకర జీవన పరిస్థితులు లేకపోవటం వంటి కారణాలవల్ల మలేరియా విజృంభిస్తుందని పల్నాడు జిల్లా క్రోసురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారిని బాల అంకమ్మ బాయ్ అన్నారు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జరిగిన ర్యాలీని ఉద్దేశించి ఆమె మాట్లాడారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మలేరియా వ్యాధి తీవ్రమైన చలి జ్వరం వణుకుతో మొదలై సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే చివరికి మెదడుకు ఇతర శరీర అవయాలకు సోకి రోగిని తీవ్ర ఇబ్బందికి గురిచేస్తుందని ఆమె పేర్కొన్నారు కావున మలేరియా వ్యాధి పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని ఆమె అన్నారు ఈ సందర్భంగా ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ మాట్లాడుతూ మలేరియా వ్యాధిలో ముఖ్యంగా తీవ్రమైన జ్వరం, చలి, వణుకు, వాంతులు, తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి అన్నారు ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా సమీపంలోని ఆరోగ్య, ఆశా కార్యకర్తలను సంప్రదించాలన్నారు మలేరియా వ్యాధి నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు ఈ సంవత్సరం థీమ్ "మెరుగైన ప్రపంచం కోసం మలేరియా పై పోరాటాన్ని వేగవంతం చేద్దాం"అన్న అంశం అని పేర్కొన్నారు దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గూర్చి ఆయన వివరించారు నిల్వ ఉన్న నీటిలో దోమలు వృద్ధి చెందుతాయి కాబట్టి మీరు ఎక్కడా నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలని దోమలు ఇంట్లోకి రాకుండా కిటికీలు, వెంటిలేటర్లకు నెట్ అమర్చుకోవాలని, వారానికి ఒక రోజు అనగా ప్రతి శుక్రవారం ప్రజలందరూ డ్రైడేను విధిగా పాటించాలని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ సిరి చందన మాట్లాడుతూ ఇంటి పరిసరాల్లో పాత టైర్లు కొబ్బరి చిప్పలు పగిలిన సీసాలు ప్లాస్టిక్ కవర్లో వాడిన టీ డిస్పోజల్ కప్పులు ఇతర నీటి నిలువలు గల చిన్న పాత్రలో నీటిని ఎప్పటికప్పుడు తొలగించాలని వారానికి ఒకసారి నీటి పాత్రలను శుభ్రపరిచి నీటిని నింపుకోవాలని ఆమె తెలిపారు చేద్దాం చేద్దాం మలేరియాపై పోరాటం చేద్దాం, మలేరియా రహిత సమాజమే ప్రపంచ మలేరియా దినోత్సవ ముఖ్య ఉద్దేశం, చిన్న ప్రాణులు పెను ప్రమాదం, దోమల నియంత్రణ మనందరి బాధ్యత, ఫ్రైడే డ్రై డే , పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత, ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ సిబ్బంది నినాదాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు బాల అంకమ్మ భాయ్ సిరి చందన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సాంబశివరావు మలేరియా సబ్ యూనిట్ అధికారి షేక్ బేగ్, ఆరోగ్య పర్యవేక్షకులు శివుడు అమర జ్యోతి ప్రభావతి , ఆరోగ్య కార్యకర్తలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు


VM Today News

Admin

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2024. All right Reserved.

Developed By :