VM Today News - రాజకీయం / పల్నాడు : నరసరావుపేట వాకర్స్ క్లబ్ లో చేరెందుకు రెడీగా ఉండు నీ బూతులకు, అహంకారానికి ప్రజలే బుద్ధి చెప్తారు వైసీపీ వాళ్లే కాదు ఆఖరికి నీ వేల్పూరు ప్రజలే నిన్ను ఆదరించట్లా అత్యధిక మెజారిటీతో వినుకొండను గెలవబోతున్నాం రాష్ట్రంలో కరెంట్ బిల్లులతో మోత- నిరుద్యోగ సమస్యతో యువత వ్యధ ప్రజల ఆలోచించుకొని ఓటేయండి శావల్యపురం మండల పర్యటనలో శ్రీకృష్ణదేవరాయలు, ఆంజనేయులు, మల్లికార్జున రావు ,శావల్యపురం: బొల్లా బ్రహ్మనాయుడు నీ పని అయిపోయింది, నిన్ను ఓడించేందుకు వినుకొండ ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని.. ఉమ్మడి కూటమి నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు , వినుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి జీవి ఆంజనేయులు, మక్కెన మల్లికార్జున రావు అన్నారు. మంగళవారం శావల్యపురం మండలంలోని, కొత్తలూరు, తుమ్మకుంట, వేల్పూరు గ్రామాల్లో పర్యటించారు. బ్రహ్మనాయుడు సొంతూరు వేల్పూరులోనే ప్రజలు నీరాజనాలు పట్టారు. బ్రహ్మనాయుడు ఓటమి ఖాయం అయిపోయిందని, దుకాణం సర్దుకొని నరసరావుపేట వాకర్స్ క్లబ్లో చేరేందుకు రెడీ అవ్వాలని పేర్కొన్నారు. డబ్బుందని అహంకారంతో ఊగిపోతూ, ఎమ్మెల్యే హోదాలో ఉండి కూడా బూతులతో పెట్రేగిపోతున్న బ్రహ్మనాయుడుకి ఓటుతో ప్రజలే బుద్ధి చెప్పాలని అన్నారు. నిన్ను టిడిపి నేతలే కాదు, వైసిపి నేతలు, ఆఖరికి నీ వేల్పూరు ప్రజలు కూడా ఆదరించే పరిస్థితి లేదని అన్నారు. నియోజకవర్గంలో అవినీతి ఎక్కువైపోయిందని విమర్శించారు. నియోజకవర్గంలో జల్జీవన్ మిషన్తో ప్రతి ఇంటికి నీటిని తెస్తామని అన్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఒకవైపు కరెంట్ బిల్లులతో పేదలకు షాక్ తగులుతుందని అన్నారు. విచ్చల విడిగా గంజాయి దొరుకుతుందే గాని, యువతకు ఉపాధి దక్కట్లేదని విమర్శించారు. ఈ పరిస్థితిని మార్చుకోవాలంటేbతెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని... మే 13నప్రతి ఒక్కరూ సైకిల్ పై ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
Reporter
VMToday News