VM Today News - వార్తలు / : ఏపీలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. 25 లోక్‌సభ స్థానాలకు 965 మంది, 175 అసెంబ్లీ స్థానాలకు 5,460 మంది నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం అధికారులు వాటిని పరిశీలిస్తారు. ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ఈసీ అధికారికంగా ప్రకటిస్తుంది. మే13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ జరగనుంది.
Reporter
VMToday News