VM Today News - వార్తలు / పల్నాడు : పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యానికి భద్రత వైద్యాధికారిణి బాల అంకమ్మ బాయి పరిసరాల పరిశుభ్రత పాటిస్తే దోమల ద్వారా వచ్చే వ్యాధులను పారద్రోల వచ్చునని పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యానికి భద్రత అని పలనాడు జిల్లా క్రోసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని ఎన్ బాల అంకమ్మ భాయ్ అన్నారు గురువారం ఆమె మండలంలోని పారుపల్లి గ్రామంలో జ్వరాల పరిస్థితి చేపట్టిన పారిశుధ్య చర్యలు వైద్య శిబిరాల నిర్వహణ గూర్చి వివరించారు గ్రామస్తులకు జ్వరాలు పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు మార్చి నెల 5వ తేదీ నుండి గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ప్రస్తుతం గ్రామంలో జ్వరాలు పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నట్లు ఆమె తెలిపారు గ్రామంలో ఎటువంటి వైరల్ జ్వరాలు నమోదు కాలేదని ప్రస్తుతం సంభవించుచున్న జ్వరాలు కేవలం సీజనల్ జ్వరాలు మాత్రమే అని ఆమె పేర్కొన్నారు గ్రామస్తులు ఎండవేడికి తగినట్లుగా సరిపడా ద్రవపదార్థాలు సేవించాలని నీడ పట్టున ఉండాలని ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎండలో బయట కు రాకూడదన్నారు ప్రస్తుతం గ్రామ ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఆరోగ్య సిబ్బందికి పంచాయతీ సిబ్బందికి సహకరించవలసిందిగా ఆమె కోరారు ఆరోగ్య సిబ్బంది తెలియజేసే ఆరోగ్య సూచనలు తూచా తప్పకుండా పాటించాలన్నారు గ్రామంలో ఫాగింగ్ కార్యక్రమం దోమల నియంత్రణకు యాంటీ లార్వా ఆపరేషన్ కార్యక్రమం నిర్వహించినట్లు ఆమె తెలిపారు వైద్య సిబ్బంది చే ఇంటింటి లార్వాను కనుగొనే కార్యక్రమం మరియు జ్వరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు గ్రామంలో మురుగునీరు సక్రమంగా పారేటట్లుగా మురుగునీటిపై చెత్తను, కాలువలో గల సిల్టును తోడి సుదూర ప్రాంతాలకు తరలించాలని, మురుగునీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో కాలువలు అన్నిట్లో ఏబేటు తదితర రసాయనాలను పిచికారి చేయించాలని, చెత్త కుప్పలను, ఎరువు దిబ్బలను ఊరికి దూరంగా ఉండేటట్లు చూడాలని, దోమతెరలు వినియోగించుకోవలసినదిగా ప్రజలకు విస్తృతంగా ప్రచారం గ్రావించాలని , పందులను ఊరికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండేటట్లు చూడాలని ఆమె గ్రామ కార్యదర్శికి ఆదేశించినట్లు తెలియజేశారు
Admin
VMToday News