VM Today News - క్రైమ్ వార్తలు / పల్నాడు : వినుకొండ పట్టణంలో అప్పుల మోసాల ఘటనలు ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వివిధ వ్యాపారాల పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు సేకరించి తిరిగి చెల్లించకుండా పరారయ్యే సంఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. నరసరావుపేటకు చెందిన ప్రైవేట్ చిట్స్ సంస్థ బోర్డు తిప్పేయడంతో పలువురు పెట్టుబడిదారులు నష్టపోయారు. ద్విచక్ర వాహనాల వ్యాపారం నిర్వహించిన వ్యక్తి కూడా డబ్బులు తీసుకుని మాయమైనట్లు సమాచారం. వినుకొండలో ఓ పుస్తకాల వ్యాపారి కోట్ల రూపాయలు సేకరించి పరారైన ఘటన బాధితులను తీవ్రంగా దెబ్బతీసింది. ముఖ్యంగా డాల్ వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలు లక్షల రూపాయలు కోల్పోయినట్లు తెలుస్తోంది. లాయర్స్ స్ట్రీట్‌లో ఏపీ ఆన్‌లైన్ కేంద్రం నిర్వహించిన శేఖర్ 18 మందికి పైగా వారికి నోటీసులు పంపడం చర్చనీయాంశమైంది. తాను అప్పుల్లో ఉన్నానని బాకీలు చెల్లించలేనని తెలిపినట్లు బాధితులు చెబుతున్నారు. సీనియర్ సిటిజన్లు, బ్యాంకులు కూడా ఈ వ్యవహారంలో నష్టపోయి పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి వివరాలు తెలుసుకుని జాగ్రత్తగా వ్యవహరించాలని స్థానికులు సూచిస్తున్నారు.
Reporter
VMToday News