VM Today News - వార్తలు / పల్నాడు : 'మోంత' తుఫాను ముంచు కొస్తున్న నేపథ్యంలో, తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఏలూరు శశికుమార్ విజ్ఞప్తి చేశారు. తుఫాను కారణంగా సంభవించే ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన తెలియచేసారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు. టోల్ ఫ్రీ నంబర్లకి కాల్ చేసి సహాయక చర్యలు పొందాలని వర్షాలు కురిసే సమయంలో ఎవరూ బయటకు రావొద్దని శశి కుమార్ ప్రజలను కోరారు. అధికారులు, విపత్తు నిర్వహణ సిబ్బంది ఇచ్చే సూచనలను తప్పక పాటించాలని తమ ప్రయాణాలను రద్దు చేసుకోవాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 112, 1070 ట్రోల్ ఫ్రీ నెంబర్ 18004250101 సంప్రదించాలని సూచించారు.
Admin
VMToday News