VM Today News - వార్తలు / పల్నాడు : పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం శ్రీనివాస గిరిజన కాలనీకి చెందిన గుమ్మనంపాటి హసీనా బేగం గత కొన్ని రోజుల క్రితం తన భర్త అత్తమామలు వేధిస్తున్నారని నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సుమారు 40 రోజుల కౌన్సిలింగ్ తర్వాత ముద్దాయిలు చెప్పిన ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. తదుపరి భర్త తాలూకా వారు సంబంధం లేని ప్రమోద్ శ్రీనివాసులతోపాటు ఆడబిడ్డ ఆశాబి ఆడబిడ్డ భర్త ఆదం షఫీ మరిది హుస్సేన్లు AP39CS 8972 కారులో ది 16 /5/2025 రాత్రి సుమారు 8 గంటల సమయంలో ప్రమోదు శ్రీనివాస్ లు మద్యం సేవించి హసీనా బేగం ఇంటిపైకి వచ్చి తలుపులను తన్ని ఆడపిల్ల అని చూడకుండా అసభ్యకరమైన మాటలతో దాడి చేసి కేసు రాజి పడకపోతే చంపేస్తామని తనను తన కుమారుడిని కిడ్నాప్ చేస్తామని బెదిరించి భయభ్రాంతులకు గురి చేయగ అదే సమయంలో స్థానికులు పోలీసులకు ఫోన్ చేయగా ముద్దాయిల లో కొంతమంది పారిపోగా ప్రమోద్ శ్రీనివాసులను పోలీస్ స్టేషన్ అప్పచెపితే పోలీసు వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదని బాధితురాలు కి ఎటువంటి న్యాయం జరగలేదని స్పందనా లో ఫిర్యాదు చేసిన అనంతరం మహిళా పోలీస్ స్టేషన్ కి వెళ్లిన బాధితురాలు సిఐ సుభాషిని ఇరువర్గాలను పిలిచే క్రమంలో దాడి చేసిన ముద్దాయులను పిలవకుండా ఆమె కట్నం కానుకలు గురించి మాట్లాడి కేసును క్లోజ్ చేయటం జరిగింది ఈ విషయంపై ఈరోజు స్పందన ఎస్పీ గారిని కలవడానికి వచ్చిన బాధితురాలు హసీనా బేగం తో సిఐ సుభాషిని మరలా ఎందుకొచ్చావు నీ సంగతి లోపలికి రా తేలుస్తా అని బాధితురాలికి అక్రమ సంబంధం అంటగట్టి బెదిరించే ప్రయత్నం చేసిందని మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత సిఐ సుభాషిని గారిపై ఉంటే బాధితులను బెదిరించడం చాలా బాధాకరమని ముద్దాయిలపై చర్యలు తీసుకొని బాధితురాలికి రక్షణ కల్పించకపోతే మహిళా కమిషన్ ని అలాగే హోం మినిస్టర్ ని కలవనున్నట్లు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్ పాల్ మీడియాతో మాట్లాడారు ... మీడియాతో మాట్లాడేటప్పుడు బాధితురాలతో పాటు తన కుమారుడు సమీర్ ఉన్నారు ....
Admin
VMToday News