VM Today News - వార్తలు / గుంటూరు : గుంటూరు, పల్నాడు జిల్లాల మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం..ఈరోజు గుంటూరు టౌన్ లోని విజేత గార్డెన్స్ నందు జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లో మేళం మధుబాబు అధ్యక్షతన గుంటూరు జిల్లా చైర్మన్ పవన్ కుమారు ఆధ్వర్యంలో జరిగిన బి&జి మానవ హక్కులు మరియు అవినీతి నిరోధక సంఘం సమావేశంలో గుంటూరు జిల్లా చైర్మన్ గా పవన్ కుమార్ ని, పల్నాడు జిల్లా చైర్మన్ గా లక్ష్మయ్య ని, పల్నాడు జిల్లా వైస్ చైర్మన్ గా యన్.కోటేశ్వర రావు ని,గుంటూరు జిల్లా మహిళా విభాగం చైర్మన్ గా జిగిరెడ్డి నిర్మల ని, జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు గుండా రెడ్డి మల్లికార్జున రెడ్డి ,జాతీయ డైరెక్టర్ బయ్యపునేని.వెంకటేశ్వర్లు నియమించడం జరిగింది. అదేవిధంగా పల్నాడు జిల్లా లీగల్ అడ్వైజర్ గా సునీత ని, ఎన్టీఆర్ జిల్లా లీగల్ అడ్వైజర్ గా ఇందిరా ని జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు గుండా రెడ్డి మల్లికార్జున రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. అదేవిధంగా పల్నాడు జిల్లా లోని వినుకొండ నియోజకవర్గ ఇన్చార్జి గా జి.వి. నాగేశ్వర రావు ని, పెదకూరపాడు నియోజకవర్గ ఇన్చార్జి గా పి.దీపక్ ని జాతీయ అధ్యక్షులు గుండా రెడ్డి మల్లికార్జున రెడ్డి నియమించడం జరిగింది. అనంతరం జాతీయ అధ్యక్షులు గుండా రెడ్డి మల్లికార్జున రెడ్డి ని రెండు జిల్లా ల చైర్మన్ అండ్ సభ్యులు దుశాల్వతో సత్కరించడం జరిగింది, అనంతరం సభ్యులు అందరూ కలిసి రెండు జిల్లాల చైర్మన్ లకు అభినందనలు తెలియజేసి వారికి కూడా శాల్వాతో సత్కరించడం జరిగింది. అనంతరం సమావేశంలో జాతీయ అధ్యక్షులు గుండా రెడ్డి మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ మానవ హక్కుల పరిరక్షణ కోసం, మహిళ ల రక్షణ కోసం ప్రతి ఒక్కరూ పని చేయాలని, హక్కులు, చట్టాల పరిరక్షణ కోసం పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి అని సదస్సు లో సభ్యులకి చెప్పడం జరిగింది., అనంతరం మధు బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా సమాజంలో అధికారులతో,నాయకులతో కలిసి పని చేయాలని, ప్రతి ఒక్కరూ హక్కుల పై తెల్సుకుని సమాజంలో సమస్యల పరిష్కారం కోసం ముందుకు వెళ్లాలని సభ్యులకి వివరించడం జరిగింది...అనంతరం గుంటూరు,పల్నాడు జిల్లాల చైర్మన్ లు, నియోజకవర్గ ఇన్చార్జి లు పాల్గొన్నారు..
Admin
VMToday News