VM Today News - రాజకీయం / పల్నాడు : పల్నాడు జిల్లా,నరసరావుపేట:సమాజానికి సేవలందిస్తూ గ్రామాలు వీధులు వాడలు పట్టణాలను శుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుద్ధ్య మహిళా కార్మికులను గౌరవిస్తూ బీజేపీ పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు మేళం మధుబాబు ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు రాష్ట్ర బిజెపి అధ్యక్షులు పివిఎన్ మాధవ్ మరియు బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పనతల సురేష్ పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ సూచనల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన మహిళ - మన ఆత్మగౌరవం కార్యక్రమం స్థానిక మున్సిపల్ గెస్ట్ హౌస్ లో ఘనంగా నిర్వహించారు ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు అనంతరం భారత్ మాతాకీ జై అంటూ ముఖ్య అతిథులుగా పాల్గొన్న బిజెపి నాయకులు మహిళా పారిశుధ్య కార్మికుల పాదములకు పూలతో నమస్కరించి దుశ్శాలువాలతో వారిని ఘనంగా సన్మానం చేశారు కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య మహిళా కార్మికులు 140 మందికి చీరలు పంపిణీ చేసి స్వచ్ఛభారత్ మెమొంటోలను అందించారు
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ మాట్లాడుతూ బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా మహిళలను గౌరవిస్తూ పారిశుద్ధ్య కార్మికులకు సన్మానించి మహిళా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ వానలను లెక్కచేయకుండా ప్రజల ఆరోగ్య రక్షణ కోసం శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలు ఎంతో గొప్పవని వారు తెలిపారు సమాజం ఆరోగ్యంగా ఉండాలంటే పట్టణాలు పరిశుభ్రంగా ఉండాలి ఆ పరిశుభ్రత కోసం కృషి చేస్తున్న కార్మికులు నిజమైన సేవకులని పేర్కొన్నారు పారిశుధ్య మహిళా కార్మికులు తమ కుటుంబాలను పోషించుకుంటూ సమాజానికి సేవ చేయడం గొప్ప విషయమని కొనియాడారు ముఖ్యంగా కరోనా సమయంలో పారిశుద్ధ్య కార్మికులు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా నిలబడి సమాజ సేవ చేశారని అన్నారు వారి కష్టాన్ని గుర్తించి చిన్నపాటి గౌరవ సూచకంగా చీరలను అందజేయడం జరిగిందన్నారు భవిష్యత్తులో కూడా పారిశుధ్య కార్మికుల సంక్షేమానికి తాము అండగా ఉంటామని తెలిపారు పల్నాడు జిల్లా మోర్చా అధ్యక్షులు మేళం మధుబాబు మాట్లాడుతూ స్థానికంగా పారిశుద్ధ్య సేవలందిస్తున్న మహిళా కార్మికుల సేవలను గుర్తిస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వారికి చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉంది అన్నారు పట్టణాన్ని శుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికుల పాత్ర ఎంతో ముఖ్యమని అన్నారు ఎండ వాన తేడా లేకుండా ప్రతిరోజూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వారు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని తెలిపారు ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశికుమార్ జాతీయ కౌన్సిల్ నెంబర్ వల్లెపు కృపారావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరంకుశం శ్రీనివాసరావు ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏనుముల నాగేశ్వరరావు జిల్లా ఉపాధ్యక్షురాలు గోడవర్తి సుజాత జిల్లా కార్యదర్శి కలవకుంట జాన్ బాబు ముట్లూరి భాస్కరరావు మంద రామారావు నేలపాటి జయకుమార్ వెంకట్ మేళం నిర్మలా శానిటైజర్ ఇన్స్పెక్టర్ పి రమాదేవి సెక్రెటరీ విజయ్ మేస్త్రి దానియేలు పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
Admin
VMToday News