Wednesday, 12 August 2026 11:16:01 PM
# సత్తెనపల్లి పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ విజయకేతనంలో మరో మైలురాయి # నవనీత రూప అలంకరణలో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి # పల్నాడు జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుక # బిజెపి ఆధ్వర్యంలో మన మహిళా-మన ఆత్మ గౌరవం # నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి.

నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి

Date : 28 October 2025 02:59 PM Views : 465

VM Today News - వార్తలు / పల్నాడు : ఆధార్ సంస్థ UIDAI నవంబర్ 1 నుంచి కొన్ని కొత్త రూల్స్ అమలు చేయనుంది. ఇందులో భాగంగా ఇంటి నుంచే ఆధార్ కార్డుకు సంబంధించిన వివరాలు అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆధార్ సెంటర్ల వద్ద క్యూలో నిల్చొనే పని లేకుండా అప్‌డేటింగ్ ప్రాసెస్ ఇప్పుడు సింపుల్ అయింది. మీ పేరు, చిరునామా, పుట్టిన తేదీ లేదా మొబైల్ నంబర్.. ఇలా ప్రతిదీ ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. దీంతోపాటు మరికొన్ని రూల్స్ కూడా మారబోతున్నాయి. అవేంటంటే.. గవర్నమెంట్ ఐడీ ఉపయోగించి.. ఆధార్ లో ఏవైనా కరెక్షన్స్ చేసుకోవాలంటే.. దానికోసం మీరు ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉండేది. ఇప్పుడు, మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్‌లో చేయవచ్చు. కార్డుదారులు తమ వివరాలు మార్చుకోవడం కోసం ప్రభుత్వ గుర్తింపు కార్డులను ఉపయోగించాల్సి ఉంటుంది. పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్, జనన ధృవీకరణ పత్రం వంటి అధికారిక ప్రభుత్వ పత్రాలు సాయంతో మీరు మీ ఆధార్ వివరాలను అప్ డేట్ చేసుకోవచ్చు. అలాగే అప్ డేట్ ఛార్జీలు కూడా కొన్ని మారాయి. పేరు, చిరునామా లేదా మొబైల్ నంబర్‌ అప్ డేట్ కి రూ. 75 వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ లేదా ఫొటో అప్ డేట్ కి రూ. 125 5 నుండి 7 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు, 15 నుండి 17 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు బయోమెట్రిక్ అప్ డేట్ ఉచితం. ఆధార్ రీప్రింట్ అభ్యర్థనలకు రూ. 40 ఆధార్– పాన్ లింక్ నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ తమ పాన్ కార్డుని ఆధార్ కార్డుతో లింక్ చేయాలి. ఈ ప్రాసెస్ డిసెంబర్ 31, 2025 కల్లా పూర్తి చేయాలి. ఒకవేళ లింక్ చేయకపోతే జనవరి 1, 2026 నుండి పాన్ కార్డ్ చెల్లదు. ఈజీ కేవైసీ నవంబర్ 1 నుంచి కేవైసీ ప్రాసెస్ చాలా ఈజీ అవ్వనుంది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు కెవైసీ(KYC) చేయడానికి ఇక నుంచి ఆధార్ నెంబర్ సరిపోతుంది. ఆధార్ నెంబర్ ఉపయోగించి ఓటీపీ ద్వారా ధృవీకరించి కెవైసీ పూర్తి చేయొచ్చు. అలాగే వీడియో కన్ఫర్మేషన్ లేదా ఫేస్ టు ఫేస్ వెరిఫికేషన్ ద్వారా కూడా కేవైసీ పూర్తి చేయొచ్చు


VM TODAY NEWS

Admin

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: