VM Today News - భక్తి / పల్నాడు : పల్నాడు జిల్లా గురజాల మండలం దైద గ్రామ మార్గం నుంచి సుమారు 5 కి.మీ దూరంలో అటవీ ప్రాంతంలో ఈ శైవ క్షేత్రం ఉంది. వాడపల్లిలో అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన అగస్త్యేశ్వరస్వామి క్షేత్రానికి సమీపంలో ఈ బిలం ఉన్నట్లు చెబుతారు. ఈ బిలాన్ని అగస్త్య మహర్షి తపస్సు కోసం ఉపయోగించారని స్థానికులు విశ్వసిస్తున్నారు. సుమారు 120 సంవత్సరాల క్రితం పులిపాడు గ్రామస్థులు ఈ బిలాన్ని గుర్తించారు. కాండ్ర రామయ్య, పోట్ల హనుమయ్య పశువులు మేపుతుండగా మంత్రోచ్చారణలు వినిపించాయి. శబ్దం వచ్చిన దిశగా వెతికిన వారు బండరాళ్ల మధ్య బిలద్వారం గుర్తించారు. గ్రామస్థుల సహాయంతో తాడులు కట్టి బిలంలోకి ప్రవేశించారు. ఇరుకైన మార్గంలో కొంతదూరం వెళ్లగా దివ్య లింగాకారం దర్శనమిచ్చిందని చెబుతారు. అక్కడ పూజలు జరిగిన ఆనవాళ్లు కూడా గమనించినట్లు తెలిపారు. ఆ రోజునుంచి ఆ బిలంలోని శివలింగం శ్రీ అమరలింగేశ్వరస్వామిగా పూజలు అందుకుంటోంది. భక్తుల రాకతో ఆ క్షేత్రం విశేష ప్రాచుర్యం పొందింది. మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. ఆలయ అర్చకులు సంజీవ్ కుమార్ మహాశివరాత్రి మహిమను వివరించారు.
Reporter
VMToday News