VM Today News - బ్రేకింగ్ న్యూస్ / పల్నాడు : పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయితీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వాసం లక్ష్మీ (47) అనే మహిళపై ఆమె అల్లుడు జక్కా రవి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఇంటి ముందు కూర్చుని ఉన్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. తీవ్రంగా కాలిన గాయాలతో లక్ష్మీ కేకలు వేయగా కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను రక్షించారు. జక్కా రవిపై ఇప్పటికే పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ క్షతగాత్రురాలిని తీసుకుని అద్దంకి–నార్కెట్పల్లి హైవేపై బైఠాయించారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న దాచేపల్లి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం లక్ష్మీని అత్యవసర చికిత్స కోసం గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Reporter
VMToday News