VM Today News - వార్తలు / పల్నాడు : క్షయ వ్యాధి నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని క్షయ వ్యాధి ఎవరికైనా రావొచ్చని క్షయ వస్తే భయం వద్దు మందులు వాడటం ముద్దు అని ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ అన్నారు పల్నాడు జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ జిల్లా అధికారి వి మురళీకృష్ణ ఆదేశానుసారం, వైద్యాధికారి బాల అంకమ్మ బాయ్ ఆధ్వర్యంలో ఆదివారం పల్నాడు జిల్లా క్రోసూరు మండలం క్రోసూరులో ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా అవగాహన ప్రదర్శన జరిగింది సందర్భంగా శాంసన్ మాట్లాడుతూ రెండు వారాలు పై పడిన దగ్గు, రాత్రిపూట జ్వరం రావడం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం , కళ్లే పడటం ఈ వ్యాధి ముఖ్య లక్షణాలు అన్నారు క్షయ సోకిన వారికి ప్రాణభయం అక్కర్లేదన్నారు చక్కగా మందులు వాడుతూ పౌష్టికాహారం తీసుకున్నట్లయితే ఈ వ్యాధి నుంచి నివారణ పొందవచ్చు అని పేర్కొన్నారు క్షయ వ్యాధి నివారణకు సిబినాట్, ఎక్సరే ఇతర పరీక్షలు అందుబాటులో ఉన్నాయన్నారు క్షయ వ్యాధిని త్వరితగతిన గుర్తించి సరియైన చికిత్స పొందితే తక్కువ సమయంలో పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలిపారు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు బ్యాక్టీరియాను గాలిలో విడుదల చేసినప్పుడు ఈ వ్యాధి వ్యాపిస్తుందన్నారు 2024వ సంవత్సరం గానూ ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా మనము క్షయ వ్యాధిని నిర్మూలించగలము అనే థీమును రూపొందించినట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా టీబి సూపర్వైజర్ సౌజన్య మాట్లాడుతూ టీబి రోగులు అవసరమైన నిష్పత్తిలో అన్ని పోషకాలను కలిగి ఉండే పోషకాహార సమృద్ధిగా మరియు సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు ఉదాహరణకు ఆహారంలో తృణధాన్యాలు మొక్కజొన్న బియ్యం జొన్నలు మినుములు మొదలైనవి ఉండాలన్నారు గుడ్డు చేప కూడా ఎక్కువగా తీసుకోవాలన్నారు టీబి వ్యాధిగ్రస్తులకు ప్రతినెల 500 రూపాయలు నగదు బ్యాంకు ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు ర్యాలీ పిహెచ్సి నుండి కోసూరు ప్రధాన రహదారి గుండా సాగింది. క్షయ వ్యాధి నివారణలో భాగంగా క్షయ వ్యాధిని అంతం చేద్దాం, క్షయ వ్యాధిని సమాజంలో తరిమేద్దాం, టీబి పోతుంది, దేశం గెలుస్తుంది, రెండు వారాల పైబడిన దగ్గు టీబి కి కారణం, కళ్ళే పరీక్ష చేయించుకోండి, క్షయ వ్యాధిని నిర్ధారించుకోండి అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ టీబి సూపర్వైజర్ సౌజన్య స్టాఫ్ నర్స్ అంజమ్మ, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Admin
VMToday News