VM Today News - వార్తలు / అనకాపల్లి : రానున్న మూడు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 43-45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్రపై ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర కోస్తా, తమిళనాడు, ఉత్తర కర్ణాటక వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో శుక్రవారం ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముంది.
Reporter
VMToday News